YS Sharmila: షర్మిలను ప్రతిపక్ష నేతగానే చూస్తాం : పెద్దిరెడ్డి
షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీ అయినా మాకు ఒక్కటే అన్నారు. షర్మిలను ప్రతిపక్ష నేతగానే చూస్తామన్నారు పెద్దిరెడ్డి. జగన్‌ను విమర్శించే టీడీపీ, కాంగ్రెస్ మాకు రెండు ఒక్కటే అని చెప్పారు. చంద్రబాబుది కుటుంబాల్లో చిచ్చుపెట్టే మనస్తత్వమన్నారు.
ఏపీ రాజకీయం సరికొత్త టర్న్ తీసుకుంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆమె ఏపీ కాంగ్రెస్‌లో కీలక భూమిక పోషించబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి పొలిటికల్ వార్ ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు, రాజకీయంగా షర్మిల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అధికార వైసీపీ నుంచి.. కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీ అయినా మాకు ఒక్కటే అన్నారు. షర్మిలను ప్రతిపక్ష నేతగానే చూస్తామన్నారు పెద్దిరెడ్డి. జగన్‌ను విమర్శించే టీడీపీ, కాంగ్రెస్ మాకు రెండు ఒక్కటే అని చెప్పారు. చంద్రబాబుది కుటుంబాల్లో చిచ్చుపెట్టే మనస్తత్వమన్నారు. చంద్రబాబు, సోనియా కలిసి జగన్‌ను జైలుకు పంపారని ఆరోపించారు పెద్దిరెడ్డి. మరోవైపు జగన్‌పై వైసీపీకు చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు విమర్శలు చేయడాన్ని పెద్దిరెడ్డి ఖండించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.