VSP Janasena: జనసేన నేతలకు కోర్టు షాక్.. పరారీలో ఉన్న నేతల కోసం పోలీసు వేట..
విశాఖ పట్నంలోని ఎయిర్ పోర్ట్ లో ఈనెల 15న జరిగిన అల్లర్ల సందర్భంగా.. 92 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 70 మందిని అరెస్టు చేసి మరుసటి రోజు కోర్టులో హాజరు పరిచారు.
పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో మంత్రుల వాహనాలపై దాడి, అనంతరం జరిగిన అల్లర్ల కేసులో అరెస్ట్ అయినా తొమ్మిది మంది జనసేన నేతలను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న 9 మంది జనసేన నేతలను రెండు రోజులపాటు పోలీసులు కస్టడీకి తీసుకొని తరలించారు. సెంట్రల్ జైల్ లో ఉన్న జనసేన నేతలు కోన తాతరావు, సుందరపు విజయ్ కుమార్, మూర్తి యాదవ్, సందీప్, శ్రీనివాస పట్నాయక్, కృష్ణ, రూప, శ్రీను లను భారీ భద్రత మధ్య తరలించారు.
విశాఖ పట్నంలోని ఎయిర్ పోర్ట్ లో ఈనెల 15న జరిగిన అల్లర్ల సందర్భంగా.. 92 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 70 మందిని అరెస్టు చేసి మరుసటి రోజు కోర్టులో హాజరు పరిచారు. 61 మందిని సొంత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. 9 మంది జనసేన నాయకులకు రిమాండ్ విధించింది. అప్పటినుంచి జైల్లో ఉన్న జనసేన నేతలు.. బెయిల్ కోసం కోర్టును సంప్రదించినా.. నిరాకరించింది కోర్టు. అదే సమయంలో పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడంతో పాటు.. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న జనసేన నేతలను బెయిల్ ఇచ్చినట్లయితే కేసు పై ప్రభావం చూపే ఆకాశము ఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు. దీంతో జనసేన నేతలను కోర్టు బెయిల్ డిస్మిస్ చేసింది.
పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ తో.. రెండు రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. దీంతో సెంట్రల్ జైల్లో ఉన్న 9 మంది జనసేన నేతలను పోలీసులు కస్టడీకి తీసుకొన్నారు. రెండు రోజులపాటు 9 మందిని పోలీసులు విచారిస్తారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ఎయిర్పోర్టులో మంత్రుల వాహనాలపై దాడి అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో.. 9 మంది నేతలను పోలీసులు విచారిస్తారు. మరోవైపు పరారీలో ఉన్న జనసేన నాయకులు కార్యకర్తల కోసం కూడా.. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు.
Reporter: Khaja
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..