AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: చంద్రబాబుకి చేదు అనుభవం.. పల్నాడు టూర్ లో ఎన్టీఆర్ అభిమానుల హంగామా..

చంద్రబాబు టూర్‌లో టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఫ్లెక్సీలు, జెండాలు పట్టుకుని చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. లోకేష్‌ ఫ్లెక్సీలు, అన్న NTR ఫొటోలతో ర్యాలీలో కనిపించారు.

Chandrababu: చంద్రబాబుకి చేదు అనుభవం.. పల్నాడు టూర్ లో ఎన్టీఆర్ అభిమానుల హంగామా..
Chandra Babu Tour In Palnad
Surya Kala
|

Updated on: Oct 20, 2022 | 1:02 PM

Share

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీగా తరలి వచ్చారు. ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్‌లతో రచ్చ చేశారు. అవును

చంద్రబాబు పల్నాడు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ర్యాలీలో కొంతమంది అభిమానులు.. ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. చంద్రబాబు వాహనానికి ఎదురుగా ఎన్టీఆర్ ఉన్న జెండాలు పట్టుకుని హంగామా చేశారు. నిజానికి నిన్నటి చంద్రబాబు టూర్‌లో టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఫ్లెక్సీలు, జెండాలు పట్టుకుని చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. లోకేష్‌ ఫ్లెక్సీలు, అన్న NTR ఫొటోలతో ర్యాలీలో కనిపించారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ జెండాలు పట్టుకుని మరికొందరు అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. ఈ సమయంలోనే టీడీపీ కార్యకర్తలు లోకేష్‌ ఫోటోలు పట్టుకుని హడావుడి చేశారు.

చంద్రబాబు పర్యటనలో జూనియర్ అభిమానులు హంగామా చేయడం ఇది మొదటిసారేం కాదు. గతంలో కుప్పంలో పర్యటించినప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ప్రసంగానికి అడ్డు తగులుతూ కొందరు NTR నినాదాలు చేయడంతో ఇబ్బందిపడ్డారు. అయినప్పటికీ మళ్లీ మళ్లీ అవే సీన్లు రిపీట్ అవుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..
అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌