Andhra Pradesh: ఏపీలో పిల్లలు మద్యం తాగుతున్నారంటూ వీడియో వైరల్.. స్పందించిన ప్రభుత్వం..

|

Nov 15, 2022 | 5:31 AM

సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో తప్పుడు ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఉన్నది లేనట్టూ.. లేనిది ఉన్నట్టు సృష్టించి.. ప్రజల్లో అపోహలను రేకెత్తిస్తున్నారు.

Andhra Pradesh: ఏపీలో పిల్లలు మద్యం తాగుతున్నారంటూ వీడియో వైరల్.. స్పందించిన ప్రభుత్వం..
Alcohol
Follow us on

AP Fact Check: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో తప్పుడు ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఉన్నది లేనట్టూ.. లేనిది ఉన్నట్టు సృష్టించి.. ప్రజల్లో అపోహలను రేకెత్తిస్తున్నారు. సోషల్ మీడియాలో అన్ని ఫ్లాట్‌ఫాంలలో అసత్య ప్రచారాలు, నకిలీ వార్తలను సర్క్యులేట్ చేస్తూ వైషమ్యాలను కలిగించేలా.. గిట్టని వారిపై బురదజల్లేలా చేస్తున్నారు. తాజాగా.. అలాంటి ఓ వీడియో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కు చెందినదంటూ నెట్టింట వైరల్‌గా మారింది. కొంతమంది చిన్న పిల్లలు మద్యం తాగుతున్న వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందినదంటూ పేర్కొంటూ పోస్ట్ చేశారు. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా.. కొందరు సోషల్ మీడియాలో.. పిల్లలు మద్యం (Alcohol) తాగుతున్న వీడియోను పోస్ట్ చేశారు.

ఏపీలో అసలు ఏం జరుగుతోంది..? అంటూ చిన్న పిల్లలు మద్యం తాగుతున్న ఈ వీడియోను షేర్ చేశారు. కాగా.. దీనిపై ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఇది ఏపీకి సంబంధించిన వీడియో కాదని.. ఎక్కడో జరిగిన పాత వీడియోను షేర్ చేయడం తగదంటూ వెల్లడించింది. ఇది చాలాకాలంలో నెట్టింట వైరల్ అవుతోందని పేర్కొంది. బాలల దినోత్సవం రోజున ఇలాంటి ఫేక్ స్టోరీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆమోదయోగ్యం కాదంటూ హెచ్చరించింది. ఈ ఇలాంటి ట్విట్లను షేర్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తదుపరి చర్య కోసం క్రింది ట్వీట్ ను CIDకి ఫార్వార్డ్ చేస్తున్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ వీడియో చాలా కాలంగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోందని.. ఇది తమిళనాడుకు చెందిన పాత వీడియో అంటూ పేర్కొంది. ఇలాంటి వీడియోలను పోస్ట్ చేసి.. నకిలీ వార్తలను సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తే.. చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఏదైనా పోస్ట్ చేసే ముందు.. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలంటూ ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం సూచించింది.

వీడియో చూడండి..

ఇటీవల కాలంలో ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తుండటంతో.. ఏపీకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం నకిలీ వార్తలపై దృష్టి పెట్టింది. తప్పుడు వార్తలు.. అసలు వార్తలకు సంబంధించిన అన్ని అంశాలను పోస్ట్ చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..