Vinayaka Chavithi: ఆంధప్రదేశ్ లో వినాయక చవితి పండగ సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహాల వివాదం కొనసాగుతోంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీజేపీ ఏపి చీఫ్ సోమువీర్రాజు పిలుపునిచ్చారు. చవితి వేడుకలకు పరోక్ష ఆటంకాలకు ప్రభుత్వం పాల్పడుతోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. విఘ్నాధిపతి వేడుకులకు విఘ్నాలా.. ఇదేమి దుర్మార్ఘపు ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వినాయక మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం అండ్డంకులు సృష్టిస్తోందని అన్నారు. ఇందుకు కారణం రాష్ట్ర వ్యాప్తంగా వినాయక మంటపాల సంఖ్యను తగ్గించాలని చూస్తోందని.. ఇదంతా ప్రభుత్యం కుట్ర అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మండపాల ఏర్పాటుకు నిబంధనల పేరుతో వైసీపీ ప్రభుత్వం పండగ వాతావరణాన్ని కలుషితం చేస్తోందన్నారు.
వైసీపీ ప్రభుత్వం చవితి వేడుకలకు పరోక్ష ఆటంకాలను సృష్టిస్తోందని.. దీనికి నిరసన వ్యక్తం చేయాలనీ ఏపీ ప్రజలను బీజేపీ నేతలు కోరారు. రేపు అన్ని మండల కేంద్రాల్లోని తాసిల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వడంలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..