Kesineni Nani: తండ్రి బాటలోనే తనయ.. సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కీలక ప్రకటన..

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత. ఈ విషయాన్ని కేశినేని నాని తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. విజయవాడ రాజకీయాలు ఎన్నికలకు ముందే కాకరేపుతున్నాయి. మొన్నటి వరకూ కేశినేని నాని తన రాజీనామా ప్రకటన చేయగా.. తాజాగా ఆయన కుమార్తె కేశినేని శ్వేత రాజీనామా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విజయవాడ కార్పొరేషన్‎లో 11వ డివిజన్ కార్పొరేటర్‎గా కొనసాగుతున్నారు శ్వేత.

Kesineni Nani: తండ్రి బాటలోనే తనయ.. సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కీలక ప్రకటన..
Kesineni Swetha
Follow us
Srikar T

|

Updated on: Jan 08, 2024 | 6:58 AM

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత. ఈ విషయాన్ని కేశినేని నాని తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. విజయవాడ రాజకీయాలు ఎన్నికలకు ముందే కాకరేపుతున్నాయి. మొన్నటి వరకూ కేశినేని నాని తన రాజీనామా ప్రకటన చేయగా.. తాజాగా ఆయన కుమార్తె కేశినేని శ్వేత రాజీనామా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విజయవాడ కార్పొరేషన్‎లో 11వ డివిజన్ కార్పొరేటర్‎గా కొనసాగుతున్నారు శ్వేత. తన కుమార్తె కార్పొరేటర్ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని. సోమవారం ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుకు వెళ్లి తన రాజీనామా పత్రాని సమర్పించి ఆమోదించుకున్న తరువాత టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు కేశినేని నాని. రాజీనామా చేసేకంటే ముందు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను కలిసి మాట్లాడనున్నారు. దీంతో తండ్రిబాటలోనే తనయ నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇదిలా ఉంటే.. ఆదివారం కేశినేని నానినితో టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సమావేశం అయ్యారు. దాదాపు గంటన్నరసేపు మాట్లాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నానిని బుజ్జగించేందుకు పంపించినట్లు జోరుగా చర్చ జరిగింది. అయితే నాని మాత్రం ఎక్కడా తగ్గలేదు. తన రాజీనామాపై మరో ఆలోచన లేదని చెప్పినట్లు సమాచారం. అలాగే తిరువూరు సభకు ఆహ్వానించినప్పటికీ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. తిరువూరు సభలో ఎంపీగా కేశినేని నానికి ప్రత్యేక సీటు కేటాయించడంపై స్పందించారు. తాను పార్టీనే వద్దనుకున్న తర్వాత ఇక ప్రోటోకాల్ ఏంటని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే సభకు కూడా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో నాని కుమార్తె కూడా పదవికి, పార్టీకి రాజీనామా చేయడం టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిణామమే అని చెబుతున్నారు విశ్లేషకులు. అయితే నాని ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారా.. లేక వేరే పార్టీలో చేరతారా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. సంక్రాంతి తరువాత తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..