Andhra Pradesh: ఇద్దరిని బలితీసుకున్న ముఫ్ఫై ఏళ్ళ పగ.. మిస్సింగ్ కేసు మర్డర్ గా కేసుగా మారిన వైనం.. హంతకుల కోసం గాలింపు

|

Sep 25, 2022 | 4:17 PM

ఆత్కుర్ పోలీసులు మృతదేహం పైన ఉన్న దుస్తులు, గుర్తులు బట్టి మిస్సింగ్ కేసు నమోదు చేసారు.. 20వ తేదీ న కనిపింకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసారు తోట్లవల్లురు పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించిన తోట్లవల్లూరు పోలీసులు

Andhra Pradesh: ఇద్దరిని బలితీసుకున్న ముఫ్ఫై ఏళ్ళ పగ.. మిస్సింగ్ కేసు మర్డర్ గా కేసుగా మారిన వైనం.. హంతకుల కోసం గాలింపు
Andhra Pradesh
Follow us on

Andhra Pradesh: ముఫ్ఫై ఏళ్ళ పగ ఇద్దరిని బలితీసుకుంది‌‌.. ఒకరిపై ఒకరు కక్షలతో రగిలిపోయారు.. తన తండ్రిని చంపిన వాడిని ఒకరు చంపితే‌‌.. ఆ హంతకుడిని ఎవరో చంపేసారు.. చెరువుగట్టు కింద శవమై తేలాడు.. మిస్సింగ్ కాస్తా మర్డర్ గా మారింది.. ఎవరు హత్య చేసి ఉంటారు‌.. కక్ష సాధింపే కారణమా.. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం లో ఉన్నారు పోలీసులు. చెరువుగట్టు దగ్గర చెట్టుకింద కబుర్లు చెప్పుకునే రైతులకు ఒకరోజు దారుణమైన వాసన వచ్చింది.. ముందు జంతువనుకున్నారు.. సర్పంచ్ కి సమాచారం ఇచ్చారు.. వచ్చి చూసిన సర్పంచ్ అది మనిషి మృతదేహమే అని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు‌.. సమాచారం అందుకున్న పోలీసుల సమక్షంలో మట్టి తవ్వి చూస్తే అది మనిషి మృతదేహమే.. అయితే చుట్టుప్రక్కల ఎవరై ఉంటారో తెలుసుకోవడం కష్టంగానే మారింది.

ఆత్కుర్ పోలీసులు మృతదేహం పైన ఉన్న దుస్తులు, గుర్తులు బట్టి మిస్సింగ్ కేసు నమోదు చేసారు.. 20వ తేదీ న కనిపింకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసారు తోట్లవల్లురు పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించిన తోట్లవల్లూరు పోలీసులు మిస్సయిన పుచ్చకాయల శ్రీనివాస రెడ్డి గా నిర్ధారణ చేసారు.. అతనిపేరు శ్రీనివాసరెడ్డి.. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిపాలెంలో ఉంటాడు‌‌.. ముప్ఫై సంవత్సరాల ముందు అతని తండ్రిని కిరాతకంగా చంపారు కొందరు.. కొంత కాలం తరువాత తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు శ్రీనివాసరెడ్డి.. అయితే అవతలి వాళ్ళ కక్ష కొనసాగింది.. హత్య కు పాత కక్షలే కారణమా అంటే.. ఇంకా హంతకులెవరో తేలాల్సి ఉంది.. హంతకులు ఎవరో కనుక్కోవడానికి నాలుగు టీంలుగా గాలిస్తున్నారు పోలీసులు.

గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి కి చేరుకున్నారు శ్రీనివాస రెడ్డి కుటుంబీకులు. గతం లో ఒక వ్యక్తి ని చంపిన కేసులో శ్రీనివాస రెడ్డి జైలు శిక్ష అనుభవించి వచ్చాడని కూడా పోలీసుల వద్ద సమాచారం ఉంది.. శ్రీనివాసరెడ్డి ని కొందరు వచ్చి కారెక్కిచ్చుని వెళ్ళారట.. ఆ తరువాత శ్రీనివాసరెడ్డి కనిపించడం లేదంటూ తోట్లవల్లూరు పోలీసు స్టేషనులో మిస్సింగ్ కేసు పెట్టారు.. గతంలో తండ్రిని హత్య చేసిన వారిని శ్రీనివాసరెడ్డి హత్య చేయడం కూడా అనుమనాలకు తావిస్తోంది.. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఎవరు హత్య చేసారో తేలాల్సి ఉంది‌. ఏదేమైనా.. మిస్సింగ్ కాస్తా మర్డర్ గా మారడం, అందులో గతంలో ఒకరిని హత్య చేసిన వాడు ఇప్పుడు మర్డర్ కావడంతో, పోలీసులకు పెద్ద టాస్కు గా మారింది.. మిస్సింగ్ మిస్టరీ వీడినా, హంతకులెవరో తెలియాలంటే మరో మిస్టరీ వీడాల్సిందే.

ఇవి కూడా చదవండి

Reporter: Ram, TV9 , Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..