Watch Video: ఎంత ప్రభుత్వ ఉద్యోగమైతేనేం.. మరీ ఇంత నిర్లక్ష్యమా.. అసలేం జరిగిందంటే..

ప్రభుత్వ అధికారులకు ప్రజల ధనం అంటే విలువ లేకుండా పోయింది. ప్రజలు డబ్బుతో జీతాలు తీసుకుంటూ వారు కట్టిన పన్నులతో యంత్రాగాన్ని నడుపుతూ ప్రజాధనాన్ని రోడ్డుపాలు చేస్తున్నారు. ఈ ఘటన కడప జిల్లా బద్వేలులో జరిగింది. పశువులకు వేయాల్సిన వ్యాక్సిన్ మందులను సిరంజిలను ఎక్స్పైరీ డేట్ ఇంకా ఉండగానే రోడ్డుపాలు చేశారు. పశువైద్యాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ సంఘటన. బద్వేల్ పోరుమామిళ్ల బైపాస్ రోడ్డు నాగులచెరువు వద్ద వ్యాక్సిన్లు, సిరెంజులు పారవేసి దర్శనమిచ్చాయి. పశువుల వ్యాక్సినేషన్ మందులు, సిరంజులు.. పెద్ద మొత్తంలో పారవేయడంపై స్దానికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Watch Video: ఎంత ప్రభుత్వ ఉద్యోగమైతేనేం.. మరీ ఇంత నిర్లక్ష్యమా.. అసలేం జరిగిందంటే..
Veterinary Vaccines
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 13, 2024 | 12:57 PM

ప్రభుత్వ అధికారులకు ప్రజల ధనం అంటే విలువ లేకుండా పోయింది. ప్రజలు డబ్బుతో జీతాలు తీసుకుంటూ వారు కట్టిన పన్నులతో యంత్రాగాన్ని నడుపుతూ ప్రజాధనాన్ని రోడ్డుపాలు చేస్తున్నారు. ఈ ఘటన కడప జిల్లా బద్వేలులో జరిగింది. పశువులకు వేయాల్సిన వ్యాక్సిన్ మందులను సిరంజిలను ఎక్స్పైరీ డేట్ ఇంకా ఉండగానే రోడ్డుపాలు చేశారు. పశువైద్యాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ సంఘటన. బద్వేల్ పోరుమామిళ్ల బైపాస్ రోడ్డు నాగులచెరువు వద్ద వ్యాక్సిన్లు, సిరెంజులు పారవేసి దర్శనమిచ్చాయి. పశువుల వ్యాక్సినేషన్ మందులు, సిరంజులు.. పెద్ద మొత్తంలో పారవేయడంపై స్దానికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారుల తీరును తప్పుపట్టారు ప్రజలు. నిర్లక్ష్యానికి పరాకాష్టగా పశు వైద్యాధికారుల వ్యవహారం ఉందని మండిపడుతున్నారు. పారవేసిన మందులపై ఎక్స్పైరీ డేట్ 8వ నెల 24వ సంవత్సరం వరకు ఉన్నప్పటికీ రోడ్డుపై దర్శనమిచ్చాయి.

ఈ విధంగా వ్యాక్సిన్ మందులను రోడ్డుపై పారవేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోరులేని జీవాలకు సంబంధించిన మందులను ఇలా రోడ్డు పక్కన పారేయడంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. పాడవని మందులను ఇలా బయట పారేయడం ఏమిటని పశువులకు వ్యాక్సిన్ దొరక నానా ఇబ్బందులు పడుతుంటే ఉన్న వ్యాక్సిన్లు తీసుకువెళ్లి రోడ్లు పాలు చేస్తున్నారని పశువైద్యాధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కాలం చెల్లిన వాటినైనా నిషిద్ద ప్రదేశంలో కాల్చడం కానీ గొయ్యి తీసి పూడ్చటం కానీ చేయాలని.. అలా కాకుండా ఇలా రోడ్డు పక్కన పడవేస్తే వాటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనా పశు వైద్యశాక అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో