Rajahmundry: డ్రగ్స్ కేసులో పేరు ఉందంటూ మహిళా టెకీకి ఫోన్.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్

అభివృద్ధి సంగతేమో కానీ .. సైబర్‌ యుగంలోనూ క్రైమ్‌రేట్‌ డెవలప్‌మెంట్‌కు ధీటుగా పరుగులు తీస్తోంది. 64 కళల్లో చోరకళ ఒకటంటారు. కానీ మోడ్రన్‌ డేస్‌లో ఆ ఒక్క చోరకళ.. ఇలా పరిపరి విధాలుగా పరవళ్లు తొక్కుతోంది. గతంలో దొంగతనాలు జరిగేవి. ఇప్పుడూ జరుగుతున్నాయి. హౌజ్‌ బ్రేకింగ్‌లు.. చైన్‌ స్నాచింగ్‌లు ..అటెన్షన్‌ డైవర్ట్‌ గ్యాంగ్‌లు... దారి దోపిడీలు.. అప్పుడున్నాయి. ఇప్పుడున్నాయి. తాజాగా వీటికి తోడుగా సైబర్‌ నేరాల్లో నయా ట్రెండ్‌ ఖాకీలకు సవాల్‌ విసురుతున్నాయి.

Rajahmundry: డ్రగ్స్ కేసులో పేరు ఉందంటూ మహిళా టెకీకి ఫోన్.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్
Phone Call
Follow us

|

Updated on: Mar 13, 2024 | 11:36 AM

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించి కొంతమంది సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. అమాయకులు టార్గెట్‌గా సైబర్ చీటర్స్ రెచ్చిపోతున్నారు. మాయమాటలు, బెదిరింపు ఫోన్ కాల్స్‌తో లక్షలాది రూపాయలు దోచేసుకుంటున్నారు. ఈ నేరాల్లో రోజుకో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. తాజాగా ఏపీలోని రాజమహేంద్రవరంలో అలాంటి ఇన్సిడెంటే వెలుగుచూసింది. ఓ మహిళా టెకీని సైబర్ నేరగాళ్లు ఏమర్చారు. స్థానిక దివాన్‌చెరువుకు చెందిన అడ్డాల మెస్సీ కుమారి సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయి. ఆమె ప్రజంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కుమారికి ఫిబ్రవరి 22న ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను సైబర్‌ క్రైమ్‌ పోలీసునని, కుమారిపై మాదక ద్రవ్యాలు కేసు ఉందని పేర్కొన్నాడు. తమ ఉన్నతాధికారి మళ్లీ మీకు టచ్‌లోకి వస్తాడని చెప్పాడు.

కుమారి కంగారు పడుతుండగానే… కొంత సేపటికి పోలీసు దుస్తులతో ఉన్న ఓ వ్యక్తి.. వీడియో కాల్ చేశాడు. ‘మీ ఆధార్ కార్డు వివరాలతో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుంది. మీపై కేసు నమోదు అయింది. విచారణకు హాజరు కావాలి’ అని చెప్పాడు. దీంతో భయపడిన కుమారి..  ఆ వ్యక్తి సూచించినట్లుగా ఆమె ఆధార్, పాన్, బ్యాంకు వివరాలు.. ఓ ఆన్ లైన్ లోన్ యాప్‌లో ప్రాసెస్ చేయించారు. ఆపై 2 గంటలు గడిచిన తర్వాత.. ఆమె బ్యాంకు ఖాతాలో 5 లక్షలు క్రెడిట్ అయ్యాయి.

మరో గంట ఇక్కడే మరో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది . కుమారి ఖాతాలో జమయిన రూ.5 లక్షలతో పాటుగా.. ఆమె బ్యాంకు ఖాతాలో ముందు నుంచి ఉన్న రూ.1.95 లక్షలు కలిపి మొత్తం రూ.6.95 లక్షలు కట్ అయ్యాయి. మరుసటి రోజు బ్యాంకుకి వెళ్లి కనుక్కోగా.. ఆమె వ్యక్తిగత వివరాలతో ఆన్‌లైన్‌ లోన్ సంస్థ నుంచి దుండగులు రూ.5 లక్షలు అప్పు తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. లోన్ తీసుకున్న డబ్బులతో పాటుగా తన బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదు పోవడంతో  బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులును ఆశ్రయించింది.

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల పిన్‌, సీవీవీ నెంబర్లను ఎవరికీ చెప్పవద్దని.. బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నామని చెప్పినా సరే.. ఎవరికీ సీక్రెట్‌ నెంబర్లను చెప్పకూడదని. ఎట్టి పరిస్థితుల్లో OTP ఎవరికీ షేర్‌ చేయకూడదని పోలీసుల సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..