AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఐదు లక్షల గాజులుతో అమ్మవారికి అలంకరణ.. వాటిని భక్తులు ధరించవచ్చా..?

కుంకుళ్లమ్మ ఆలయంలో వసంత నవ రాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ముందుగా ఆలయాన్ని పరిసరాలను పుష్పమాలికలు, మామిడి తోరణాల తో నయనానందకరంగా అలంకరించారు. 5 లక్షగాజుల అలంకరణలో నిండు ముత్తెదువుగా ఉన్న అమ్మవారికి పూజలు జరిపి పంచ హారతులను సమర్పించారు.

Andhra:  ఐదు లక్షల గాజులుతో అమ్మవారికి అలంకరణ.. వాటిని భక్తులు ధరించవచ్చా..?
Kunkullamma
B Ravi Kumar
| Edited By: |

Updated on: Apr 06, 2025 | 7:00 AM

Share

బెజవాడ దుర్గమ్మ, భీమవరం మావూళ్లమ్మ, ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ..ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో గ్రామ దేవత పూజలందుకుంటుంది. ఆయా గ్రామదేవతలకు ప్రతియేటా ఉత్సవాలు, జాతరలు సైతం ఘనంగా జరుగుతుంటాయి. భక్తులు, సమీప ప్రాంతాల వారు ఆలయనికి చేరుకుని పూజలు చేసి తమ తమ మొక్కులు తీర్చుకుంటారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న క్షేత్రం ద్వారకాతిరుమల. చిన వెంకన్నగా భక్తులతో విశేష పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో దేవతగా కుంకుళ్లమ్మ కొలువై ఉన్నారు. ప్రస్తుతం కుంకుళ్లమ్మ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 7 వరకు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. తర్వాత చండీ హోమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారికి ఐదు లక్షల గాజులుతో అలంకరించారు. గర్భాలయంలో వివిధ వర్ణాలతో కూడిన గాజులు దండలు అమ్మవారికి అలంకరించటంతో పండు ముత్తయిదువులా కుంకుళ్లమ్మ దర్శనం ఇస్తున్నారు.

ఉత్సవాలు ముగిసిన తర్వాత భక్తులకు అమ్మవారికి అలంకరించిన గాజులను పంపిణి చేస్తారు. వీటిని మహిళలు శుభకరంగా భావించి తమ చేతులకు ధరిస్తారు. దీని వల్ల తమకు అంతా మంచి జరుగుతుంది అని భక్తుల విశ్వసిస్తారు. ఈ కార్యక్రమాలు ఆలయ అర్చకులు భైరవ స్వామి పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలుగు రాష్ట్రాల్లో UIDAI ఆధార్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు.. అర్హతలివే
తెలుగు రాష్ట్రాల్లో UIDAI ఆధార్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు.. అర్హతలివే
లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!