Andhra Pradesh: నిన్న మాచర్ల.. నేడు తెనాలి.. రాజకీయ ‘మంట’ లతో భగ్గుమంటున్న ఉమ్మడి గుంటూరు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంటలు కలకలం రేపుతున్నాయి. మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లకు గుర్తు నిప్పులు పెట్టిన ఘటన మరువక ముందే తెనాలిలో అన్న క్యాంటీన్ భవనానికి..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంటలు కలకలం రేపుతున్నాయి. మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లకు గుర్తు నిప్పులు పెట్టిన ఘటన మరువక ముందే తెనాలిలో అన్న క్యాంటీన్ భవనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ‘మంట’ల రాజకీయం మాచర్ల నుంచి తెనాలికి షిఫ్ట్ అయినట్లైంది. శనివారం అర్థరాత్రి సమయంలో అన్న క్యాంటీన్ భవనం ముందు భారీగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్న క్యాంటీన్ గత కొదంది కాలంగా నిరుపయోగంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది.
మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ‘ఇదేం కర్మ’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో టీడీపీ-వైసీపీ మధ్య పొలిటికల్ వార్ మరింత రాజుకుంటోంది. ఓ వైపు ఇరుపార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా, కొన్ని భవనాలు, కొంతమంది నాయకుల ఇళ్లకు నిప్పులు పెట్టడం తీవ్ర దుమారానికి దారి తీస్తోంది.
మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత..పల్నాడు జిల్లా మాచర్లలో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. అల్లర్ల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మాచర్ల టీడీపీ ఇంచార్జ్ బ్రహ్మరెడ్డి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుబెట్టడంతో మాచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..