కూతురి చేతుల్లో ప్రాణాలు వదిలిన తండ్రి.. ఆ తర్వాత జీర్ణించుకోలేక.!
జూన్ 11వ తేదీ. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తెనాలి గంగానమ్మపేటోని ధాన్యం వ్యాపారి సుబ్రమణ్యం ఛాతీలో నొప్పితో అల్లాడిపోయాడు. దీన్ని గమనించిన సుబ్రమణ్యం భార్య హేమలత, కుమార్తె లక్ష్మీ శ్రావణి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. వెంటనే తండ్రి మృతదేహాన్ని తీసుకుని లక్ష్మీ శ్రావణి ఇంటికి వచ్చింది.

అయితే తండ్రి తన చేతుల్లోనే చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది లక్ష్మీ శ్రావణి. ఇంటి వద్ద తండ్రి మృతదేహాన్ని ఉంచి వెంటనే డాబా పైకి వెళ్లి కిందకి దూకేసింది. తీవ్ర గాయాలైన లక్ష్మీ శ్రావణికి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఒకేసారి తండ్రీ కూతురు చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన గురించి తెలిసిన స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సుబ్రమణ్యం, హేమలత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లక్ష్మీ శ్రావణికి ఏడాది క్రితం విజయవాడలోని భవానిపురంనకు చెందిన యువకుడితో వివాహం జరిపించారు. అయితే కొద్ది కాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో లక్ష్మీ శ్రావణి పుట్టింటించి వచ్చేసింది. తండ్రి వద్దే ఉంటూ ఎంబీఏ చదువుతోంది. ఈ క్రమంలోనే తన కళ్ల ముందే తన చేతుల్లోనే తండ్రి చనిపోవడాన్ని తట్టుకోలేకపోయింది. ఒకవైపు వైవాహిక జీవితం సాఫీగా సాగకపోవడం, తండ్రి చనిపోవడంతో తమకు దిక్కెవరూ అంటూ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఒకే రోజు కొద్ది గంటల వ్యవధిలోనే తండ్రి కుమార్తెలు మృతి చెందడం అందరిని కలవరపాటుకు గురిచేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..