AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CRIME: ఆటో బోల్తా.. ఇద్దరు మృతి.. పోలీసుల బెదిరింపులే కారణమా..

కాయాకష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న వారిని రోడ్డు ప్రమాదం(Road Accident) రూపంలో మృత్యువు కబళించింది. ప్లాస్టిక్ బుట్టలు అమ్ముకునే ఇద్దరు మహిళలు..

AP CRIME: ఆటో బోల్తా.. ఇద్దరు మృతి.. పోలీసుల బెదిరింపులే కారణమా..
Ganesh Mudavath
|

Updated on: Feb 23, 2022 | 6:55 AM

Share

కాయాకష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న వారిని రోడ్డు ప్రమాదం(Road Accident) రూపంలో మృత్యువు కబళించింది. ప్లాస్టిక్ బుట్టలు అమ్ముకునే ఇద్దరు మహిళలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడటంతో ఈ దారుణ ఘటన జరిగింది. అనంతపురం(Anantapur) జిల్లాలోని తనకల్లులో షేక్ మస్తాన్, బత్తలపల్లిలో వలీసాబ్ కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరు ప్లాస్టిక్‌ బుట్టలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఓ వాహనంలో ప్లాస్టిక్‌ బుట్టలు పెట్టుకుని హిందూపురం బయల్దేరారు. మార్గమధ్యంలో చెర్లోపల్లి సమీపానికి చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మస్తాన్‌ భార్య నన్నీబీ, వలీసాబ్‌ భార్య హుస్సేన్‌బీ అక్కడికక్కడే మృతి చెందారు. ముందువైపు కూర్చున్న మస్తాన్, వలీసాబ్‌లు ప్రమాదం నుంచి బయట పడ్డారు. సమాచారం అందుకున్న హిందూపురం పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరోవైపు.. ప్లాస్టిక్‌ బుట్టలను మంగళవారం గోరంట్లలో విక్రయించి అక్కడే చెట్ల కింద రాత్రి విశ్రమించాలని అనుకున్నట్లు బాధితులు తెలిపారు. ఐతే కొత్తవారు ఉండరాదంటూ పోలీసులు హెచ్చరించడంతో హిందూపురానికి బయలుదేరామని పేర్కొన్నారు. పోలీసుల హెచ్చరికతో భయపడి ఆందోళనతో వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని కన్నీటిపర్యంతమయ్యారు.

Also Read

Secunderabad: ఛార్జింగ్‌ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్.. క్షణాల్లో కాలి బూడిదైన ఎలక్ర్టిక్‌ బస్సు.. ఎన్ని కోట్ల నష్టమంటే..

Covid: బిల్ గేట్స్ ల్యాబ్‌లోనే కరోనా పుట్టింది.. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ సంచలన ప్రకటన..

Big News Big Debate: యుద్ధకాంక్షతో అగ్రదేశాలు దుస్సాహసం చేస్తున్నాయా? థర్డ్‌ వాల్డ్‌ వార్‌ని ప్రపంచం చూడబోతోందా.?

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
అయ్యో దేవుడా.. భార్య పంపిన ఆ నోటీసుతో భర్త ఎంత పనిచేశాడంటే..?
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
గిల్ నుంచి టీమిండియాను కాపాడారనుకునేరు.. అసలు కథ వేరుంది..
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
కింగ్ కోహ్లీ విశ్వరూపం.. 83 బంతుల్లోనే మెరుపు సెంచరీ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ
చివరకు అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దీనస్థితి.. నటి కన్నీటి గాథ