Andhra Pradesh: అధికార వైసీపీలో బాహాబాహీ.. పోలీసుల ఎదుటే ఘర్షణ
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని వైఎస్ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లెలో అధికార వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. భూమి విషయంలో చెలరేగిన ఘర్షణలో వైసీపీ(YCP) లోని రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. లక్కిరెడ్డిపల్లిలోని....
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని వైఎస్ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లెలో అధికార వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. భూమి విషయంలో చెలరేగిన ఘర్షణలో వైసీపీ(YCP) లోని రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. లక్కిరెడ్డిపల్లిలోని 1.05 ఎకరాల స్థలాన్ని చిన్నమండెం మండల జడ్పీటీసీ మాజీ సభ్యురాలి బంధువులైన వైసీపీ లీడర్ శ్రీనివాసులురెడ్డి 2019లో కొనుగోలు చేశారు. అనంతరం ఆ భూమికి డిమాండ్ పెరగడంతో ఆ భూమి పాత యజమానుల నుంచి 2022లో లక్కిరెడ్డిపల్లె ఎంపీపీ ఎం.సుదర్శన్‌రెడ్డి అనుచరులు కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తద్వారా ఒకే భూమిపై ఇద్దరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసులురెడ్డి కోర్టును ఆశ్రయించాడు. తనకు అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకున్నాడు. కోర్టు ఆర్జర్ తో శ్రీనివాసులురెడ్డి తన అనుచరులతో కలిసి ఆ స్థలంలో పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. పోలీసుల ఎదుటే ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు.
వెంటనే రాయచోటి డీఎస్పీ పి.శ్రీధర్, లక్కిరెడ్డిపల్లె సీఐ జి.రాజు అక్కడికి చేరుకొని రెండు వర్గాలను చెదరగొట్టారు. ఘర్షణలో శ్రీనివాసులురెడ్డికి చెందిన వాహనం ధ్వంసమైంది. వాహనంలో మారణాయుధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి శ్రీనివాసులురెడ్డి రివాల్వర్ తెచ్చినట్లు పోలీసులు వారించారు. పరస్పరం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇదీ చదవండి
Tomato Flu: టొమాటో ఫ్లూతో జాగ్రత్త.. చిన్న పిల్లలే దీని టార్గెట్..!