Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: టీడీపీ-జనసేనతో పొత్తుకు బీజేపీ సిద్ధమేనా?

ఏపీలో మళ్లీ 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ మళ్లీ ఒక్కటయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ఏపీ నేతల అభిప్రాయాలను ఇప్పటికే సేకరించిన బీజేపీ అధిష్టానం నివేదిక సిద్ధం చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుంచింది. త్వరలోనే అంటే సంక్రాంతిలోగా పొత్తులపై కీలక ప్రకటన చేయనుంది బీజేపీ నాయకత్వం. ఇదే సమయంలో అటు చంద్రబాబు బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటి కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

Big News Big Debate: టీడీపీ-జనసేనతో పొత్తుకు బీజేపీ సిద్ధమేనా?
Big News Big Debate
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 29, 2023 | 7:03 PM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలోనూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టీడీపీ-జనసేన- బీజేపీ మధ్య మళ్లీ పొత్తులకు లైన్‌ క్లియర్‌ అవుతోంది. బీజేపీ కూడా తమతో కలిసివచ్చేలా ప్రయత్నిస్తామన్న పవన్‌ కల్యాణ్‌ దాదాపు ఒప్పించారు. ఇప్పటికే మూడు పార్టీల మధ్య పొత్తులపై సూత్రప్రాయ అంగీకరం కుదిరింది. త్వరలోనే ఢిల్లీ వెళ్లి తుదిదశ చర్చలు జరపనున్నారు జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. టీడీపీ-జనసేన ఎక్కడ పోటీచేయాలో తమకు స్పష్టత ఉందని.. సంక్రాంతి తర్వాత ప్రకటన చేస్తామని ఇప్పటికే టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో సీట్లు సర్దుబాటు తర్వాతే అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది.

అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పొత్తులపై ఇప్పటికే తమ అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలోనూ రాష్ట్రానికి చెందిన మెజార్టీ నాయకులు పొత్తులకు అనుకూలంగా తమ అభిమతం అధిష్టానం ముందుంచారు. ఈ విషయాలను నివేదిక రూపంలో సిద్ధం చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ టేబుల్‌పై పెట్టారు పార్టీ పెద్దలు. జనసేనతో ప్రస్తుతం పొత్తులో ఉన్నామని ఇతర నిర్ణయాలు అధిష్టానం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు.

పొత్తులకు మూడు పార్టీలు సిద్ధమే.. కానీ గతంలో ఎందుకు విడిపోయారు .. ఇప్పుడు మళ్లీ ఎందుకు కలవాల్సి వస్తుందన్న ప్రశ్నలకు సమాధానం చెబుతాయా? రిపీట్‌ అవుతున్న పొత్తును ప్రజలు స్వాగతిస్తారా? అంతకుమించి పార్టీల్లో సీట్ల సర్దుబాట్లలో ఉండే సవాళ్లను అధిగమిస్తారా? డీకే శివకుమార్‌తో చంద్రబాబు భేటికి ప్రాధాన్యత ఉందా?. ఈ రోజు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో చూద్దాం…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రధాని మోదీ నిరాడంబరతకు ముగ్ధులైన శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు
ప్రధాని మోదీ నిరాడంబరతకు ముగ్ధులైన శ్రీలంక క్రికెట్ దిగ్గజాలు
ఉక్కపోతకు చెక్‌ పెట్టే పోర్టబుల్‌ ఏసీ.. ఇది ఉంటే చలితో వణికిపోవాల
ఉక్కపోతకు చెక్‌ పెట్టే పోర్టబుల్‌ ఏసీ.. ఇది ఉంటే చలితో వణికిపోవాల
శ్రీరామనవమికి ఈ ఆలయ దర్శనం.. జీవితంలో మరపురాని గుర్తు..
శ్రీరామనవమికి ఈ ఆలయ దర్శనం.. జీవితంలో మరపురాని గుర్తు..
ఆరేళ్ల క్రితం ఈవెంట్ అని పిలిచి.. జబర్దస్త్ వర్ష ఎమోషనల్..
ఆరేళ్ల క్రితం ఈవెంట్ అని పిలిచి.. జబర్దస్త్ వర్ష ఎమోషనల్..
ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
భర్త కోసం అమ్మాయిని సెట్ చేసే భార్య.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ
భర్త కోసం అమ్మాయిని సెట్ చేసే భార్య.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ
శ్రీరామ నవమి వేళ.. అయోధ్యలో అద్భుత ఘట్టం..! పోటెత్తిన భక్తులు
శ్రీరామ నవమి వేళ.. అయోధ్యలో అద్భుత ఘట్టం..! పోటెత్తిన భక్తులు
విదుర నీతిలోని అద్భుతమైన జీవిత సత్యాలు..!
విదుర నీతిలోని అద్భుతమైన జీవిత సత్యాలు..!
రాములవారి తలంబ్రాలను ఇంటికి తెస్తున్నారా.. ఇది తెలుసుకోండి
రాములవారి తలంబ్రాలను ఇంటికి తెస్తున్నారా.. ఇది తెలుసుకోండి
వాస్తు ప్రకారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవద్దు.. ఎందుకంటే..
వాస్తు ప్రకారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోవద్దు.. ఎందుకంటే..