Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 వేలకు పైగా పాములు పట్టాడు.. విషపు పాము కాటు వేయడంతో ఆసుపత్రి పాలయ్యాడు.. అతనెవరంటే!

Snake Catcher Bhaskar Naidu: తిరుమలలో ఎంత పెద్ద పాము అయినా సరే వెంటనే రంగంలోకి దిగుదాడు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాములను అవలీలగా పట్టుకోని అటవీ

10 వేలకు పైగా పాములు పట్టాడు.. విషపు పాము కాటు వేయడంతో ఆసుపత్రి పాలయ్యాడు.. అతనెవరంటే!
Snake Catcher Bhaskar Naidu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 29, 2022 | 5:14 PM

Snake Catcher Bhaskar Naidu: తిరుమలలో ఎంత పెద్ద పాము అయినా సరే వెంటనే రంగంలోకి దిగుదాడు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాములను అవలీలగా పట్టుకోని అటవీ ప్రాంతంలో వదిలేస్తుంటాడు. ఆయన చేతులతో వేలాది పాములను పట్టారు. తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన పేరు తెలియని వారుండరు.. ఆయనే టీటీడీ (Snake Catcher) స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు తాజాగా పాము కాటుకు గురయ్యారు. విషపూరితమైన పాము కాటు వేయడంతో ఆయన్ను హుటాహుటిన స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.

గత రాత్రి పామును పట్టే సమయంలో భాస్కర్ నాయుడు కాటుకు గురైనట్లు అధికారులు తెలిపారు. పాములను చాకచక్యంగా పట్టుకోవడంలో భాస్కర్ నాయుడు దిట్ట. ఇప్పటి దాకా 10వేలకు పైగా పాములను పట్టుకుని భాస్కర్ నాయుడు సురక్షిత ప్రాంతాల్లో వదిలారు. ఫారెస్టు మజ్దూర్ గా రిటైరైనప్పటికీ భాస్కర్ నాయుడు సేవలను టీటీడీ కొనసాగిస్తోంది.

Also Read:

Afghanistan: ఆకలి తీర్చుకునేందుకు అవయవాలను అమ్ముకుంటున్నారు.. ఆఫ్గన్ ప్రజలను ఆదుకోండి: WFP

Andhra Pradesh: పొలంలో పశువులు మృతి.. దాని పనే అంటున్న గ్రామస్తులు..!