TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్..! మధ్యాహ్నం 2 తర్వాత వారికి నో ఎంట్రీ.. తిరుమల మెట్టుమార్గంలో కొత్త ఆంక్షలు

|

Aug 13, 2023 | 9:21 PM

TTD Restrictions on Childrens: శ్రీవారి భక్తులకు అలెర్ట్..! తిరుమలలో వన్యమృగాల సంచారం దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గాల్లో చిన్నారుల భద్రతపై దృష్టి సారించిన టీటీడీ పలు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరించింది.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్..! మధ్యాహ్నం 2 తర్వాత వారికి నో ఎంట్రీ.. తిరుమల మెట్టుమార్గంలో కొత్త ఆంక్షలు
TTD
Follow us on

TTD Restrictions on Childrens: శ్రీవారి భక్తులకు అలెర్ట్..! తిరుమలలో వన్యమృగాల సంచారం దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా చిన్నారిపై చిరుత దాడి నేపథ్యంలో తిరుమల నడక మార్గాల్లో చిన్న పిల్లల అనుమతిపై ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు నడకదారుల్లో అనుమతి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు నడకదారిలో పోలీసులను అప్రమత్తం చేసింది. ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి పోలీసులు ట్యాగ్ లు వేస్తున్నారు. దీంతో పిల్లలు తప్పిపోయినా, అనుకోని ఘటనలు జరిగినా సులభంగా కనిపెట్టేందుకు ఈ ట్యాగ్‌లు ఉపయోగపడతాయని టీటీడీ తెలిపింది. పిల్లలకు వేస్తున్న ట్యాగ్‌పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నంబర్, పోలీసుల టోల్‌ ఫ్రీ నంబర్‌ నమోదు చేస్తున్నారు. అలాగే రెండో ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల తరువాత బైక్‌లకు అనుమతి నిరాకరించినట్టు టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.

ఇటీవల నడక మార్గంలో ఓ చిన్నారిపై దాడి చేసి చిరుత చంపేయడం అందరినీ కలచివేస్తోంది. గతంలో కూడా ఓ బాలుడిపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనల దృష్ట్యా నడకదారిలో టీటీడీ అధికారులు, పోలీసులు అప్రత్తమయ్యారు. అంతే కాకుండా అలిపిరి నడక మార్గంలో హై అలర్ట్ ప్రకటించిన ప్రాంతంలో సాయంత్రం ఆరు గంటల నుండి 100 మందిని కలిపి గుంపులు గుంపులుగా ఏడోవ మైలు నుండి శ్రీ నృశింహ స్వామి వారి ఆలయం వరకు పంపనున్నారు. ఈ భక్తుల సమూహానికి ముందు భాగంలోనూ, వెనుక భాగంలోనూ పోలీసు సిబ్బంది భధ్రత కల్పిస్తారని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి భక్తులు కచ్చితంగా టీటీడీ విధించిన ఆంక్షలు పాటించాలని హెచ్చరించారు.

చిన్నారి కుటుంబానికి 10లక్షల ఎక్స్‌గ్రేషియా

మరోవైపు టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి… లక్షితపై చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. చిన్నపిల్లలతో తిరుమలకు వచ్చే భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి 10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

నడక మార్గంలో సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఈవో చెప్పారు. రెండు నడక మార్గాల్లోపారెస్టు, పోలీస్, టీటీడీ కలిసి మరింత ఎక్కువ మందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసామని ఈవో చెప్పారు. నడకమార్గంలో భద్రతా చర్యలను పర్యవేక్షించిన ఈవో పలు సలహాలు, సూచనలు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..