టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇటీవల జంబో పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 31 మంది సభ్యులతోపాటు.. మరో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జీవోలను కూడా జారీ చేసింది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వాటిపై హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు అయ్యాయి. నిబంధనలకు విరుద్దంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రధానంగా కోర్టులో వాదించారు. దీనివల్ల సామాన్య భక్తులపై భారం పడుతుందని వివరించారు. ఇక వాదోపవాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ల తరపు వాదనలను ఏకీభవిస్తూ ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని తప్పుబట్టింది. అలాగే టీటీడీ బోర్డు నిర్ణయంపై సీరియస్ అయింది. దీనితో ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇక దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి..
Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!