Tirumala Laddu: ఆయన ఉన్నప్పుడే గోల్‌మాల్ జరిగింది.. టీటీడీ మాజీ సభ్యుడు సంచలన వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఈ వివాదంతో అటు వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఈ వివాదంతో అటు వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలో టీటీడీ బోర్డు మాజీ మెంబర్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బటర్ ఆయిల్‌తో లడ్డూ ప్రసాదం తయారు చేశారని సంచలన ఆరోపణలు చేశారు రమణ. తిరుమలలో మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్‌మాల్ జరిగిందని దుయ్యబట్టారు. టీటీడీ రూల్స్‌ను పక్కనపెట్టి ట్రేడర్స్‌ను తీసుకొచ్చారన్నారు. ఢిల్లీ నుంచి ఆల్ఫా అనే సంస్థను తిరుమలకు తీసుకొచ్చారని.. ఆల్ఫా కంపెనీ విదేశాల నుంచి బటర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది.
ఇది చదవండి: అమ్మబాబోయ్.! ఇంటి ప్రహరీ గోడకు పెద్ద కన్నం.. కనిపించింది చూడగా కళ్లు తేలేశాడు
బటర్ ఆయిల్‌లో గేదె, ఆవు, జంతువుల నెయ్యి కలిసి ఉంటుంది. బటర్ ఆయిల్‌తో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేశారు. ఆవు నెయ్యి కాకపోవడంతో లడ్డు నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది. మాజీ ఈవో ధర్మారెడ్డి కమీషన్ కోసం కక్కుర్తిపడి, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని టీటీడీ బోర్డు మాజీ మెంబర్ రమణ ధ్వజమెత్తారు. మరోవైపు తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా చేసే సరఫరాదారుల్లో ఒకరు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్టు టీటీడీ ఈ ఏడాది జూలైలో అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక కంపెనీని సైతం బ్లాక్ లిస్టులో పెట్టామని కూడా పేర్కొంది.
ఇది చదవండి: 16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం.. టీ20ల్లో అరుదైన రికార్డు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..