Tirupati Laddu: శ్రీవారి లడ్డూ వివాదం.. ఇంతకీ సంవత్సరానికి ఎంత నెయ్యి కావాలంటే.?

తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత భక్తుల్లో నెలకొన్న ప్రశ్న ఇది. యస్‌.! గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో..

Tirupati Laddu: శ్రీవారి లడ్డూ వివాదం.. ఇంతకీ సంవత్సరానికి ఎంత నెయ్యి కావాలంటే.?
Tirumala Laddu
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 19, 2024 | 11:23 AM

తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత భక్తుల్లో నెలకొన్న ప్రశ్న ఇది. యస్‌.! గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇక లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీటీడీ మాజీ ఛైర్మన్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. దీనిపై తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు వైవీ సుబ్బారెడ్డి. ఇదిలా ఉంటే.. అసలు తిరుమల లడ్డూ తయారీ ఎలా జరుగుతుంది.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.? 2021వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా అసలేం జరిగింది.? ఆ వివరాలు..

ఇది చదవండి: అమ్మబాబోయ్.! ఇంటి ప్రహరీ గోడకు పెద్ద కన్నం.. కనిపించింది చూడగా కళ్లు తేలేశాడు

తిరుమల లడ్డూ తయారీలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. తిరుమల లడ్డూకు ప్రతీ రోజూ 300-500 లీటర్ల నెయ్యిని వినియోగిస్తుంది టీటీడీ. టీటీడీ మార్కెటింగ్‌ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ప్రతి 6 నెలలకొకసారి టెండర్లు పిలిచి ఇ- ప్రోక్యూర్‌మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్‌ కూడా తిరుమలలోనే ఉంది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే టాపిక్‌ భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. 2021 మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. 2021 మార్చి లో జరిగిన టెండర్లలో L-3 గా నిలిచింది. అయినా కూడా L-1, L-2 అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరైన నెయ్యిలో కేవలం 20 శాతం సప్లై చేసింది. ఆ తర్వాత నుంచి మాత్రం టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. యూపీకి చెందిన ప్రీమియర్ L-1 గా, L-2గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి రూ. 424 లు ప్రకారం టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. టీటీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్‌ తేల్చి చెప్పింది. దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తుందంటూ టీటీడీపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: 16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం.. టీ20ల్లో అరుదైన రికార్డు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..