ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రాన్స్‌పోర్ట్‌ లారీ.. ప్రయాణీకుల ప్రాణాల్ని కాపాడిన ప్రమాదం..ఏం జరిగిందంటే..

| Edited By: Jyothi Gadda

Sep 04, 2023 | 12:31 PM

బస్సు రోడ్డు పక్కకి దూసుకెళ్ళింది. అయితే అదే సమయంలో నరసరావుపేట వైపు నుంచి వస్తున్న నవత ట్రాన్స్పోర్ట్ లారీ అనుకోని విధంగా ఆ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే బస్సు రోడ్డు సైడ్ కు దూసుకుపోయి ఏ చెట్టునో ఢీ కొంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెప్తున్నారు.

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రాన్స్‌పోర్ట్‌ లారీ.. ప్రయాణీకుల ప్రాణాల్ని కాపాడిన ప్రమాదం..ఏం జరిగిందంటే..
Tsrtc Bus
Follow us on

గుంటూరు, సెప్టెంబర్ 04: ఓ ప్రమాదం బస్సు ప్రయాణికులను కాపాడింది. నిజమే సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతాయి. కాని ఈ ప్రమాదం మాత్రం ప్రాణాలు పోకుండా కాపాడింది. ఏంటా అని ఆశ్చర్యపోకండి. అదే నిజం.. లేదంటే ఎంతోమంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చేది. మమ్మల్ని ఓ ట్రాన్స్పోర్ట్ లారీ రూపంలో భగవంతుడే కాపాడాడు అని ప్రయాణికులే చెప్పుకుంటున్నారు. విషయం ఏంటంటే శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం మునుగోడు కు ఆర్టీసీ బస్సు వెల్తుంది. అయితే నర్సరావుపేట మండలం పెట్లూరి వారి పాలెం వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో బస్సు రోడ్డు పక్కకి దూసుకెళ్ళింది. అయితే అదే సమయంలో నరసరావుపేట వైపు నుంచి వస్తున్న నవత ట్రాన్స్పోర్ట్ లారీ అనుకోని విధంగా ఆ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే బస్సు రోడ్డు సైడ్ కు దూసుకుపోయి ఏ చెట్టునో ఢీ కొంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెప్తున్నారు.

అయితే, నవతా ట్రాన్స్పోర్ట్ లారీ ప్రమాదం రూపంలో బస్సును ఢీకొనడంతో ప్రయాణికులను కాపాడినట్లు అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లారీ, బస్సు డ్రైవర్లుకు ఎటువంటి గాయాలు అవలేదు. లారీ ముందు భాగం మాత్రం కొంతమేర దెబ్బతింది. ప్రమాదం నుండి అందరూ క్షేమంగా బయటపడటంతో తమ తమ గమ్య స్థానాలకు ప్రయాణీకులు వెళ్ళిపోయారు.

అటు, చిత్తూరు జిల్లాలో కూడా మరో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం సమీపంలో అర్ధరాత్రి లారీని కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రం,హున్సూర్ ఎక్సైజ్ డిఎస్పీగా పని చేస్తున్న విజయ్ కుమార్ తన కుటుంబంతో తిరుమల వెంకన్నను దర్శనం చేసుకొని తిరిగి బెంగళూరుకు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న లారీని వెనుక వైపు నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీఎస్పీ విజయ్ కుమార్ తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలిసింది.డీఎస్పీకి రెండు కాళ్లు విరిగాయని తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..