Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. నేడు అంగప్రదక్షిణ టోకెన్ల విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే?

|

Jan 24, 2023 | 7:00 AM

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మంగళవారం( జనవరి 24) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి వీటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచునున్నారు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. నేడు అంగప్రదక్షిణ టోకెన్ల విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే?
Tirumala
Follow us on

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మంగళవారం( జనవరి 24) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి వీటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచునున్నారు. ఈమేరకు టోకెన్ల విడుదలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా.. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు అంగప్రదక్షిణం టోకెన్ల జారీని నిలిపివేశామని అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో నకిలీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ అధికారిక వెబ్‌సైట్లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం సోమవారం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని 72,998 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు టీటీడీ తెలిపింది.

మరోవైపు ఈ నెల 28న రధసప్తమి కోసం తిరుమలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. సూర్య జయంతి సందర్భంగా నిర్వహించే వేడుకలను అత్యంత ఘనంగా టీటీడీ సమాయత్తం అవుతోంది. మినీ బ్రహ్మోత్సవాలుగా పరిగణించే ఈ ఉత్సవాల కోసం భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..