TTD Special Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపు ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల..
TTD Special Darshan Tickets: రేపు ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్లో టికెట్లను అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరుకోవాలని టీటీడీ పేర్కొంది.
TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ప్రత్యేక దర్శనం కోసం టీటీడీ ఆన్‌లైన్లలో టికెట్లను విడుదల చేయనుంది. రేపు (మే20) ఉదయం జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రూ. 300 దర్శన టికెట్లను విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్లో టికెట్లను అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరుకోవాలని టీటీడీ పేర్కొంది. మరిన్ని వివరాల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలని కోరింది.
వారికి ముఖ్య గమనిక..
కాగా వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్థం జూన్ 30వ తేదీ వరకు అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళపాద పద్మారాధన సేవా టికెట్లను జూన్ వరకు ఆన్‌లైన్ విడుదల చేయడంతో భక్తులు బుక్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం సేవా టికెట్లు బుక్ చేసుకున్న వారిని అష్టదళ పాదపద్మారాధన సేవకు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే అడ్వాన్స్ బుకింగ్‌లో జూన్ 30 వరకు తిరుప్పావడ సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఆయా తేదీల్లో బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని, లేదంటే రీఫండ్ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: