Detox Water: ఎక్కువగా ఏసీ గదుల్లో పనిచేస్తున్నారా? అయితే ఈ డిటాక్స్ వాటర్ ప్రయోజనాలేంటో తెలుసుకోండి.
Detox Water: రోజంతా ఎనర్జిటిక్ గా ఉండేందుకు తరచుగా టీ, కాఫీలు తాగుతున్నారా? బదులుగా డిటాక్స్ వాటర్ తాగడం ప్రారంభించండి. పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి
డిటాక్స్ వాటర్‌లో అన్ని రకాల పండ్లను ఉపయోగించుకోవచ్చు. ఇది శరీరానికి కావాల్సిన నీటి అవసరాలను తీరుస్తుంది. డీహైడ్రేషన్ సమస్యలను తగ్గిస్తుంది.
1 / 8
రోజంతా ఎయిర్ కండిషన్డ్ రూమ్‌లో కూర్చోవడం వల్ల పెద్దగా చెమట పట్టదు. దీనివల్ల శరీరం నుండి హానికరమైన లేదా విష పదార్థాలను బయటకు వెళ్లే అవకాశం ఉండదు. అలాంటి వారు డిటాక్స్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
2 / 8
డిటాక్స్ వాటర్‌లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
3 / 8
మలబద్ధకం సమస్యలు ఉన్నవారు ఈ డిటాక్స్ వాటర్‌ను రెగ్యులర్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది.
4 / 8
డిటాక్స్ వాటర్ అనేది ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్. నీటితో నిండిన పండ్ల ముక్కతో పెద్ద నోటితో గాజు కూజాను నింపండి. కనీసం 5 నుండి 6 గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా రెండు రోజుల పాటు నీటిని ఉంచుకుని తాగొచ్చు. డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పెరుగుతాయి. విషతుల్య పదార్థాలు బయటకు పోతాయి.
5 / 8
డిటాక్స్ వాటర్ మన జీవక్రియ రేటును పెంచుతుంది. ఫలితంగా, కేలరీలు సులభంగా కరుగుతాయి. శరీరంలో వ్యాధి నిరోధకత కూడా పెరుగుతుంది. తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వారు ఈ డిటాక్స్ వాటర్ తాగితే మేలు జరుగుతుంది.
6 / 8
రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. అయితే చాలామంది వీటికి బదులుగా తరచుగా టీ, కాఫీలు లాగేస్తున్నారు. వీటి స్థానంలో డిటాక్స్ వాటర్‌ను ఎంచుకోవడం మంచిది