Andhra News: అనుమానమే పెనుభూతమై.. తల్లి పాలిట యముడిలా మారిన కొడుకు.. కట్‌చేస్తే..
టెంపుల్ సిటీ తిరుపతిలో కొన్ని గంటల వ్యవధిలోనే రెండు దారుణ హత్యలు జరగడం స్థానికులను ఉలిక్కిపడేలా చేశాయి. తల్లిపై ప్రవర్తనపై అనుమానంతో ఓ కుమారుడు ఆమెను గొంతు నులిమి హత్య చేయగా.. భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెను అతికిరాతకంగా గొంతుకోసి హత్య చేసి, ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

టెంపుల్ సిటీ తిరుపతిలో కొన్ని గంటల వ్యవధిలోనే రెండు దారుణ హత్యలు జరగడం స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. తల్లిపై ప్రవర్తనపై అనుమానంతో ఓ కుమారుడు ఆమెను గొంతు నులిమి హత్య చేయగా.. భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెను అతికిరాతకంగా గొంతుకోసి హత్య చేసి, ఆ తర్వాత భర్తకూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తల్లిని గొంతు నులిమి హత్య చేసిన కొడుకు తర్వాత నేరుగా వెళ్లి పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులొ భాగంగా తల్లి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో నిందితుడు తల్లిని గొంతు నులిమి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రొంపిచర్ల మండలం మోట మల్లెలకు చెందిన 38 ఏళ్ల శారద అనే మహిళకు చిన్నగొట్టికల్లు మండలం నల్ల ఓబులవారిపల్లికి చెందిన సురేష్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఏడాది క్రితం ఉపాధి కోసం భర్త సురేశ్ కువైట్‌కి వెళ్లిపోగా.. భార్య శారధ ఇద్దరు పిల్లలతో కలిసి తిరుపతి గొల్లవానిగుంటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఇక శారధ కూడా రేణిగుంట రోడ్డులో ఉన్న మారుతి మారుతి షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇక ఈమె పెద్ద కొడుకు ధనుష్ ఇంటర్ చదువును మధ్యలోనే ఆపేసి.. సిటీలో బలాదూర్‌గా తిరుగుతూ జులాయిగా మారాడు. ఇంట్లో ఏపని చేయకపోగా.. దురలవాట్లకు బానిసై ఇంట్లో వాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే గత కొద్ది రోజులుగా తల్లిప్రవర్తనపై కొడుకు ధనుష్‌కు అనుమానం వచ్చింది. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో కొడుకు తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలోనే తల్లితో గొడవ పడుతూ వస్తున్న పెద్ద కొడుకు ధనుష్.. శుక్రవారం మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. తనకున్న అనుమానంపై తల్లిని నిలదీశాడు. ఈ క్రమంలో తల్లి, కొడుకుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఇక మద్యం మత్తులో ఉన్న ధనుష్ తల్లి శారదపై దాడి చేసి.. ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు.
కొన్ని గంటల తర్వాత మద్యం మత్తు నుంచి బయటకొచ్చిన ధనుష్.. తేరుకొని జరిగిన విషయాన్ని తన సొంతూరులో ఉంటున్న అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్పాడు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. తల్లిని తానే హతమార్చినట్లు కొడుకు ధనుష్ అంగీకరించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
