AP Weatherman : తిరుపతి యువకుడిపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో సాయి ప్రణీత్ సేవలను మోదీ కొనియాడారు. ‘ఏపీ వెదర్ మ్యాన్’ పేరుతో వాతావరణ సమాచారాన్ని అందిస్తున్న సాయి ప్రణీత్.. సామాజిక మాధ్యమాల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను ప్రధాని మోదీ అభినందించారు.
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూనే సాయి ప్రణీత్.. 7 ఏళ్ళుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ ఐఎండీ ఐక్యరాజ్యసమితి హ్యాబిటేట్ ప్రశంసలను కూడా అందుకున్నారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. సాయి ప్రణీత్ ను అభినందించడం పట్ల అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఇలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రతినెలా జరిగే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 79వ ఎపిసోడ్‌లో భాగంగా మోదీ పలు కీలక విషయాలపై ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్స్ కి వెళ్లిన భారత క్రీడాకారులను ఉద్దేశించి కూడా మోదీ మాట్లాడారు. దీంతోపాటు కరోనా వైరస్, వ్యాక్సిన్ తదితర అంశాలపై మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
Modi
Read also : Women Hulchal : పార్వతీపురంలోని ఒక లాడ్జిలో మకాం.. విజయనగరం జిల్లాలో గుజరాతీ మహిళల హల్ చల్