AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: మరోసారి తిరుమలేశుడి సేవలో.. టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఈనెల 8న ముగియనుంది. ఆయన స్థానంలో ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నభూమన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Tirumala: మరోసారి తిరుమలేశుడి సేవలో.. టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర రెడ్డి
MLA Bhumana Karunakar Reddy
Basha Shek
|

Updated on: Aug 05, 2023 | 4:38 PM

Share

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఆయన స్థానంలో ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నభూమన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా భూమన చేతికి టీటీడీ పగ్గాలు రావడం ఇది రెండోసారి. 2006-2008 మధ్య కాలంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు భూమన. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా, టీటీడీ మెంబర్‌గా ఉన్నారాయన. కాగా అప్పుడు వైఎస్‌ హయాంలోనూ … ఇప్పుడు జగన్‌ హయాంలో భూమన టీటీడీ పగ్గాలు స్వీకరించడం విశేషం. సుమారు రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారాయన. కాగా వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా భూమన కరుణాకర్ రెడ్డికి పేరుంది. 2019 నాటి ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయనని భూమన స్పష్టం చేశారు. తన స్థానంలో తన కుమారుడు భూమన అభినయ్‌ రెడ్డికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని కోరనున్నారు. దీనికి సంబంధించి చాలా రోజులుగా చర్చలు నడుస్తున్నాయి

కాగా దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో సుమారు రెండేళ్ల పాటు టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు భూమన. ఆయన హయాంలోనే దళిత గోవిందం తదితర టీటీడీ పథకాలు అమల్లోకి వచ్చాయి. 2019 లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా టీటీడీ ఛైర్మన్ గా భూమన పేరే మొదటగా వినిపించింది. అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఆ పదవి వైవీ సుబ్బారెడ్డికి దక్కింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..