AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gannavaram Airport: సుమారు గంటన్నర సమయం.. గన్నవరం ఎయిర్ పోర్టులో రెండు విమానాలు.. గాలిలో చక్కర్లు.. చివరికి..

సుమారు గంటన్నర సమయం.. రెండు విమానాలు.. గాలిలో చక్కర్లు.. ఇది ఎక్కడో కాదు మన గన్నవరం ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన.. చివరికి దిగకుండానే..

Gannavaram Airport: సుమారు గంటన్నర సమయం.. గన్నవరం ఎయిర్ పోర్టులో రెండు విమానాలు.. గాలిలో చక్కర్లు.. చివరికి..
Gannavaram Airport For An Hour And A Half Due To Fog
Sanjay Kasula
|

Updated on: Jan 31, 2022 | 11:06 AM

Share

Gannavaram Airport: సుమారు గంటన్నర సమయం.. రెండు విమానాలు.. గాలిలో చక్కర్లు.. ఇది ఎక్కడో కాదు మన గన్నవరం ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన.. చివరికి దిగకుండానే హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు దుప్పటి కప్పేసింది. ఈ ప్రభావంతో ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యం అవుతున్నాయి. సోమవారం ఉదయం మంచు దెబ్బకు ఢిల్లీ, బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన విమానాలు పొగమంచుతో ఎయిర్‌పోర్టు చుట్టూ గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఎయిర్ పోర్ట్ రన్‌వేపై పొగమంచు ఎక్కువగా ఉండడంతో విమానం ల్యాండ్ అయ్యేందుకు అస్సలు కుదరలేదు.. దట్టమైన పొగమంచు కప్పేయడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.

బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ఇండిగో విమానం సుమారు గంటన్నర సేపు గాలిలో చక్కర్లు కొట్టి కొట్టి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి హైదరాబాద్ లో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన ఇండిగో విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టూ చక్కర్లు కొట్టడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని ఎయిర్‌పోర్టు అధికారలు వెల్లడించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లుగా తెలిపారు. పొగ మంచు పరిస్థితులు చక్కబడ్డాక విమానాల ల్యాండింగ్‌కు తిరిగి అనుమతి ఇస్తామంటున్నారు.

ఇవాళ మాత్రమే కాదు.. రెండు వారాలుగా మంచు ఎయిర్‌పోర్టులో విమానలు దిగేందుకు ఇబ్బందిగా మారుతోంది. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మంచు ప్రభావం తగ్గిన తర్వాతే అధికారులు విమానాలు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి: CM KCR: పార్లమెంట్‌లో ఇలా చేద్దాం.. పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం..

Viral Video: చూశారుగా.. నేనేంటో.. నా బలమేంటో.. సైలెంట్‌గా చేసి చూపించింది..