TTD News: తిరుమలలో రికార్డు స్థాయిలో భక్తులు.. హుండీ ఆదాయంలోనూ..
తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ అసామాన్యంగా పెరుగుతోంది. కరోనాతో విధించిన ఆంక్షలతో అరకొరగా శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులు.. తాజాగా టీటీడీ నిబంధనలు సడలించడంతో ఒకేసారి పోటెత్తారు. కరోనా లాక్ డౌన్(Corona Lock Down) తర్వాత...
Tirumala News: తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ అసామాన్యంగా పెరుగుతోంది. కరోనాతో విధించిన ఆంక్షలతో అరకొరగా శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులు.. తాజాగా టీటీడీ నిబంధనలు సడలించడంతో ఒకేసారి పోటెత్తారు. కరోనా లాక్ డౌన్(Corona Lock Down) తర్వాత తొలిసారిగా 80వేల మందికి పైగా భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. నిన్న(బుధవారం) ఏకంగా 88,748 మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. సర్వదర్శనం క్యూలైన్ల ద్వారా 46,400 మంది భక్తులు, రూ.300 దర్శన క్యూ లైన్ ద్వారా 25,819 మంది భక్తుల, వర్చువల్ సేవా టికెట్లు, సేవా టికెట్లు, టూరిజం శాఖ కేటాయింపుల ద్వారా 16,529 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 38వేల 558 భక్తులు తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి దర్శనాలతో పాటు హుండీకి భారీ ఆదాయం వచ్చింది. నిన్న ఒక్క రోజే రూ.4.82 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు గురువారం ఉదయం తెలిపారు. కాగా మంగళవారం జరిగిన తీవ్ర తోపులాట నేపథ్యంలో టీటీడీ(TTD) అధికారులు అప్రమత్తం అయ్యారు. దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఇకపై టోకెన్లు లేకుండా నేరుగా స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. గ్రామీణ, కంప్యూటర్ పరిజ్ఞానం లేని భక్తులు నష్టపోతున్నారని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇవాళ(గురువారం) కూడా క్యూలైన్లలో పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. ప్రస్తుతం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వెయిటింగ్ చేస్తున్నారు. భక్తులకు త్వరగా దర్శనం కల్పించడంతో పాటు.. తాగునీరు, ఆహార సదుపాయాలు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. కంపార్ట్ మెంట్లలోని భక్తులకు అల్పాహారం, పాలు పంపిణీ అందిస్తున్నారు.
ఏం జరిగిందంటే..
తిరుమలలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల విషయంలో భక్తుల తోపులాట జరిగింది. టోకెన్ల కోసం భక్తులు భారీగా ఎగబడటంతో తోపులాట జరిగింది. రెండురోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తులు తిరుపతిలో వేచి ఉన్నారు. తిరిగి ఈ రోజు మళ్లీ సర్వదర్శనం టోకెన్ల (Sarvadarshana tokens) కౌంటర్లు ఓపెన్ కావడంతో భక్తులు భారీగా వచ్చారు. టోకెన్ల కోసం చిన్న పిల్లలు సైతం క్యూలైన్‌లో నిల్చుని ఇబ్బందులకు గురయ్యారు. రెండు రోజుల అనంతరం గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు పంపిణీ జరిగింది. అయితే గోవిందరాజస్వామి సత్రం వద్ద వేచి ఉన్న భక్తులతో పాటు ఈ రోజు కూడా భక్తులు భారీ ఎత్తున క్యూలైన్‌లోకి రావడంతో ఈ తోపులాట జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Also Read
ఏనుగు దురదను తగ్గించుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు !! ఫన్నీ వీడియో
Economic crisis: శ్రీలంకను మించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ మూడు దేశాలు.. ఎందుకంటే..