Love Story: అచ్చం ‘శివమణి’ సినిమాలాగే.. 56 ఏళ్ల నాటి సీసాలో దొరికిన లెటర్.. ఓపెన్ చేస్తే మైండ్ బ్లాంక్..!
Love Story: ప్రస్తుత టిండెర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్‌ల యుగంలో బాయ్‌ఫ్రెండ్-గర్ల్‌ఫ్రెండ్ కలవడం పెద్ద సమస్యేమీ కాదు. కుడి చేత్తో ఇలా ఫోన్ స్వైప్ చేస్తే చాలు..
Love Story: ప్రస్తుత టిండెర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్‌ల యుగంలో బాయ్‌ఫ్రెండ్-గర్ల్‌ఫ్రెండ్ కలవడం పెద్ద సమస్యేమీ కాదు. కుడి చేత్తో ఇలా ఫోన్ స్వైప్ చేస్తే చాలు.. అలా బాయ్ ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్‌తో డేటింగ్‌లో పాల్గొనే ఫెసిలిటీస్ నేడు ఉన్నాయి. అయితే, ఇప్పుడున్న ఈ సంస్కృతికి, 50 ఏళ్ల నాటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. దాని పరిస్థితులకు అద్దం పట్లే ఒక అద్భుతం తాజాగా వెలుగు చూసింది. అప్పట్లో బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ మాట్లాడుకోవాలంటే విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వచ్చేది. తాజాగా ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇంగ్లండ్‌లో లభించింది. బాయ్ ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్న ఇద్దరు యువతులు 56 ఏళ్ల క్రితం రాసిన వ్రాతపూర్వక సందేశం దొరికింది.
ఇంగ్లాండ్‌లోని నార్త్ లింకన్‌షైర్‌లో స్కన్‌థార్ప్ లిట్టర్ పికర్స్ గ్రూప్.. వ్యర్థాలు, పాత వస్తువులను తీస్తుంది. ఇటీవల ఈ గ్రూప్‌లోని వ్యక్తులకు దాదాపు 56 ఏళ్ల నాటి పురాతన బాటిల్ కనిపించింది. అందులో ఒక కాగితం ఉండటం గమనించారు వారు. దాంతో దాన్ని ప్రత్యేకంగా భావించిన సిబ్బంది.. బాటిల్‌ను పక్కకు పెట్టారు. ఆ తరువాత దానిని ఓపెన్ చేసి చూడగా.. అందులో ఒక లెటర్ ఉంది. అది బాయ్ ఫ్రెండ్స్ కోసం ఇద్దరు యువతులు రాసిన లేఖ అది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బాటిల్ పాడైపోలేదు, కాగితం చిరిగిపోలేదు.
గాజు సీసాలో దొరికిన 56 ఏళ్ల లేఖను ఇద్దరు యువతులు ఆగస్టు 9, 1966న రాశారు. అందులో వారు తమ బాయ్‌ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నారు. అమ్మాయిల పేర్లు జెన్నిఫర్ కోల్‌మన్, జానెట్ బ్లాంక్లీ. చేతితో రాసిన ఈ నోట్‌లో ఇద్దరూ తమ రూపాన్ని వివరంగా వివరించారు. వారిద్దరితో సంబంధంలోకి రావాలనుకునే వారికి ఫోటో కూడా అందించబడుతుందని రాశారు. తన బాయ్‌ఫ్రెండ్‌కు 16 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదని, 18 ఏళ్లు మించకూడదని వారు డిమాండ్ చేశారు. దాంతో పాటు ఆ యువతులు తమ ఇంటి చిరునామాను కూడా రాశారు.
లేఖ రాసిన జెన్నిఫర్‌ను కనుగొన్నారు.. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో.. వ్యక్తులను కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ 56 ఏళ్ల నాటి లేఖను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశాడు. దాంతో ఆ లేఖ రాసిన వారు ఎవరు? ఎలా ఉంటారు? ఎక్కడ ఉంటారు? అనే పూర్తి వివరాలను కనిపెట్టారు. ప్రస్తుతం 71 సంవత్సరాల యవస్సు ఉన్న జెన్నీఫర్ దొరికిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. లేఖను వారికి తిరిగి ఇచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతుందట. ఈ నోట్‌ను రాసి నదిలో వేసినప్పుడు జెన్నీఫర్, జానెట్‌ల వయసు 15 సంవత్సరాలట.
జానెట్‌ను కూడా కనిపెట్టారు.. జెన్నిఫర్ ఆస్ట్రేలియాకు మారడంతో జానెట్‌తో ఏళ్లుగా సంబంధాలు తెగిపోయాయి. కానీ ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్‌కి చేసిన వ్యాఖ్యలో, నార్త్ ఇంగ్లాండ్‌లోని ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ జానెట్ బ్లాంక్లీ కూడా టచ్‌లో ఉన్నారని తెలిసింది. ఆయన జానెట్ కొడుకు, సోదరుడిని సంప్రదించడానికి ప్రయత్నించారు. వారితో పరిచయం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Also read: