Purandeswari: టీటీడీ ఛైర్మన్‌గా భూమన నియామకంపై పురంధేశ్వరి అభ్యంతరం.. హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్లనే..

|

Aug 09, 2023 | 6:25 AM

గతంలో ఒకసారి టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన భూమన, ఆ అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగిస్తానంటున్నారు. తిరుమల శ్రీవారికి ప్రథమ సేవకుడిగా, హిందూ ధర్మం వ్యాప్తి కోసం కృషిచేస్తానని చెబుతున్నారు టీటీడీ కొత్త ఛైర్మన్‌. అయితే, టీటీడీ ఛైర్మన్‌గా భూమనను నియమించడంపై అభ్యంతరం చెబుతున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. తిరుమల తిరుపతి దేవస్థానం.. రాజకీయ పునరావాసం కాకూడదన్నారామె

Purandeswari: టీటీడీ ఛైర్మన్‌గా భూమన నియామకంపై పురంధేశ్వరి అభ్యంతరం.. హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్లనే..
Daggubati Purandeswari
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్‌గా గురువారం (ఆగస్టు 10) బాధ్యతలు చేపట్టనున్నారు భూమన కరుణాకర్‌రెడ్డి. ప్రస్తుత ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో టీటీడీ పగ్గాలు అందుకోబోతున్నారు. గతంలో ఒకసారి టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన భూమన, ఆ అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగిస్తానంటున్నారు. తిరుమల శ్రీవారికి ప్రథమ సేవకుడిగా, హిందూ ధర్మం వ్యాప్తి కోసం కృషిచేస్తానని చెబుతున్నారు టీటీడీ కొత్త ఛైర్మన్‌. అయితే, టీటీడీ ఛైర్మన్‌గా భూమనను నియమించడంపై అభ్యంతరం చెబుతున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. తిరుమల తిరుపతి దేవస్థానం… రాజకీయ పునరావాసం కాకూడదన్నారామె. అంతేకాదు, హిందూ ధర్మంపై నమ్మకమున్నోళ్లు మాత్రమే ఆ పదవికి న్యాయం చేయగలరంటూ ట్వీట్‌ చేశారు. హిందూ ధర్మాన్ని అనుసరించనివాళ్లను ఎలా టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు పురంధేశ్వరి. ‘తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కారాదు. హిందూ ధర్మం పై నమ్మకమున్నవాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరు. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం జరిగింది. ఈ విషయం పై గళం విప్పిన తరువాత 52 మంది నియామకాలను నిలిపివేశారు. అంటే ప్రభుత్వం ఈ నియామకాలను కూడా రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తున్నదని అర్ధమవుతున్నది. కనుక టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మం పై నమ్మకమున్న వారిని, హిందూ ధర్మం అనుసరించే వాళ్లని నియమించాలి’ అని ట్వి్ట్టర్‌లో రాసుకొచ్చారు పురంధేశ్వరి.

కాగా ప్రస్తుతం పురంధేశ్వరి వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న ఆమె వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్నారు. ఇటీవల టీవీ9 ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పోలవరం ప్రాజెక్టు జాప్యానికి టీడీపీతో పాటు వైసీపీ ప్రభుత్వాలు కారణమని దుయ్యబట్టారు. అలాగే ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీలు నాటకాలాడుతున్నాయని విమర్శించారు. అలాగే ప్రభుత్వ వైఖరి కారణంగానే ఏపీకి పెట్టుబడులు రావడం లేదని.. ఇక్కడి పరిస్థితులను చూసి ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..