కీలక నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ! డబ్బుల వసూలుకు పాల్పడ్డమే కారణం..!
ఓ నేత కడప మహానాడు సమయంలో నారాయణ విద్యాసంస్థల నుండి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుమలేశ్ ప్రస్తుతం కడప జిల్లా TNSF నేత గా ఉన్నారు.

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి అనుచరుడు తిరుమలేశ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. మహానాడు సమయంలో నారాయణ విద్యాసంస్థల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం రావడంతో ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దగ్గర ప్రస్తావించారు మంత్రి నారాయణ. ఈ విషయంపై సీరియస్ అయిన టిడిపి అధిష్టానం, విచారణ జరిపించింది. అనంతరం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రస్తుతం కడప జిల్లా TNSF నేతగా ఉన్నారు తిరుమలేష్.
కడపలో ఇటీవల మహానాడును అట్టహాసంగా నిర్వహించింది. ఈ సమయంలోనే తిరుమలేశ్ మహానాడు పేరుతో వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. అధిష్టానం నుంచి తిరుమలేశ్‌ను సస్పెండ్ చేయాలనే ఆదేశాలు రావడంతో ఎమ్మెల్యే మాధవీరెడ్డి ముందుగానే అతడితో రాజీనామా చేయించినట్టు తెలుస్తోంది. సొంత పార్టీ నేతకు చెందిన విద్యాసంస్థల నుంచే వసూళ్లకు పాల్పడినట్టు తేలడంతో ఇంకా మిగతా చోట్ల ఎంత మంది దగ్గర వసూళ్లకు పాల్పడి ఉంటాడో కూడా టీడీపీ అధిష్టానం విచారణలో బయటపడే ఉంటుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




