AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: వామ్మో ఇంతుందేంటి భయ్యా.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్

ఈ మధ్య కాలంలో టెంపుల్‌ సిటీ తిరుమలలో పాముల హల్చల్‌ చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వచ్చి భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొసారి వెలుగు చూసింది. ఓ 12 అడుగుల భారీ కొండ చిలువ భక్తులను హలడలెత్తించింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Tirumala: వామ్మో ఇంతుందేంటి భయ్యా.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్
Tirumala Python
Raju M P R
| Edited By: |

Updated on: May 20, 2026 | 2:38 PM

Share

టెంపుల్‌ సిటీ తిరుమలలో పాములు హల్చల్ చేస్తున్న ఘటనలు తరచూ వెలులు చూస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వచ్చి భక్తులను భయపెడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో వెలుగు చూసింది. అలిపిరి నడకమార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న భక్తులకు సుమారు 12 అడుగుల పొడవున్న ఓ భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు.

అనంతరం టీడీడీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు భక్తులు. వెంటనే అప్రమత్తమైన టిటిడి సెక్యూరిటీ ఫారెస్ట్ విభాగంలో పాములు పట్టే కాంట్రాక్టు ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న భాస్కర్ నాయుడు ఆ 12 అడుగుల భారీ కొండచిలువను పట్టుకునేందుకు ప్రత్నించాడు. అయినప్పటికీ ఆ కొండచిలువ అతన్ని ముప్పతిప్పలు పెట్టింది.

ఇక చాలా సేపటి తర్వాత తీవ్రంగా శ్రమించిన స్నేక్ క్యాటర్ ఎంతో చాకచక్యంగా భారీ కొండచిలువను బంధించాడు. దాన్ని ఒక సంచిలో వేసుకొని దూరంగా అటవీప్రాంతంలోకి వెల్లి వదిలిపెట్టాడు. దీంతో అక్కడున్న భక్తులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ సిబ్బంది కీలక సూచనలు చేశారు. ఎవరికైనా పాములు కనిపిస్తే వాటి జోలికి వెళ్లవద్దని.. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us