AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల మొదటి ఘాట్‌లో విగ్రహం చోరీ.. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు

తిరుమల మొదటి ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ చిన్న విగ్రహం చోరీకి గురైంది. వేకువ జామున జరిగిన ఈ ఘటన సీసీ కెమెరా ల్లో నమోదైంది. అనుమానితుడి కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

తిరుమల మొదటి ఘాట్‌లో విగ్రహం చోరీ.. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు
Tirumala Idol Theft
Raju M P R
| Edited By: |

Updated on: Jul 22, 2026 | 2:58 PM

Share

తిరుమల మొదటి ఘాట్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్రహం చోరీకి గురైంది. 7వ మైలు వద్ద ఉన్న ఆలయంలో హనుమంతుడి చిన్న విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. హనుమంతుడి విగ్రహాన్ని పెకలించి చోరీ చేసినట్లు తెలుస్తోంది. వేకువ జామున 3 గంటల సమయంలో ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. సీసీ కెమెరాలో రికార్డైన చోరీ దృశ్యాలపై ఆరా తీస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహ సమీపంలో ఉన్న సిసి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్న దుకాణాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడి కోసం గాలిస్తున్నారు. గోవింద మాల ధరించిన భక్తులు అడుగు ఎత్తు ఉన్న చిన్న సైజు హనుమంతుడి విగ్రహాన్ని పెకిలించి బ్యా‌గ్‌లో ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు టిటిడి విజిలెన్స్ సిబ్బందితో కలిసి 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మహా అపచారం..

తిరుమల మొదటి ఘాట్‌లోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్రహం చోరీపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఇది మహా అపచారమన్నారు. టీటీడీ యంత్రాంగం ఏం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, టిటిడి పాలక మండలి సమాధానం చెప్పాలన్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో ఎన్నో ఏళ్లుగా ఆంజనేయ స్వామి అక్కడ పూజలందుకుంటున్నారన్నారు. స్వామి వారి విగ్రహం మాయమైనా గుర్తించలేక పోయారని ఆరోపించారు టిటిడి మాజీ చైర్మన్ భూమన.

వీడియో చూడండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us