Tirumala Darshan: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సర్వ దర్శనాలు పున: ప్రారంభం.. ఎప్పటినుంచంటే!

|

Sep 07, 2021 | 9:46 PM

Tirumala Free Darshans: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. రేపట్నుంచి తిరుమలలో ఉచిత దర్శనాలకు అనుమతి ఇస్తూ కీలక ప్రకటన చేసింది...

Tirumala Darshan: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సర్వ దర్శనాలు పున: ప్రారంభం.. ఎప్పటినుంచంటే!
Follow us on

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. రేపట్నుంచి తిరుమలలో సర్వ దర్శనాలకు(ఉచిత దర్శనం) అనుమతించనుంది. ఈ మేరకు కీలక ప్రకటనను జారీ చేసింది. సెప్టెంబర్ 8వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో రోజుకు 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను కేటాయించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే సర్వ దర్శనం టోకెన్లను ఇవ్వనుండగా.. త్వరలోనే మిగతా జిల్లాల వారికి కూడా టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ తెలిపింది. కాగా, కరోనా కారణంగా 6 నెలల నుంచి సర్వదర్శనాలను టీటీడీ నిలిపివేసిన సంగతి విదితమే. మరోవైపు రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్లు ఉన్నవారిని, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను మాత్రమే ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తూ వస్తోంది.

అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో కరోనా నిబంధనలను అనుసరిస్తూ ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు సర్వదర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. గతంలో రోజూ 8 వేల సర్వదర్శనం టికెట్లను టీటీడీ జారీ చేయగా.. తాజాగా రోజుకు 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను విడుదల చేయనుంది.

కాగా, సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవా టిక్కెట్లు కోటాను ఆగష్టు 24వ తేదీన టీటీడీ విడుదల చేసింది. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో, గోవిందా యాప్‌ల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఆన్‌లైన్‌ 8వేల టికెట్లను అందుబాటులో ఉంచింది.

Also Read:

తెలంగాణ: స్కూల్స్‌లో ఫిజికల్ క్లాసులు.. మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

 పొదల్లో దాగున్న పులి.. కనిపెట్టండి చూద్దాం మరీ.. పజిల్ మాత్రం చాలా కష్టం గురూ!

ఈ బుడ్డోడికి సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.. ఎవరో గుర్తుపట్టండి.!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. కోపంతో విషసర్పం దాడి.. గగుర్పొడిచే వీడియో!

3 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీలు.. 4 టెస్టులతో కెరీర్ క్లోజ్.. ఈ టీమిండియా ప్లేయర్ ఎవరంటే.?