Andhra-pradesh: ఒంగోలులో ప్రత్యేక సైరన్‌.. 57ఏళ్ల ప్రస్థానం.. విశేషం ఏంటో తెలిస్తే..

| Edited By: Jyothi Gadda

Aug 25, 2023 | 7:30 PM

కొండమీద ఓల్డ్ ఫిల్టర్ బెడ్ దగ్గర పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది రోజుకు ఐదు సార్లు ఈ సైరన్ ను మ్రోగిస్తారు. ప్రస్తుతం కాలం మారింది... చేతులకు గడియారాలు వచ్చాయి, పోయాయి... మొబైల్ ఫోన్లలో సయయంతో పాటు అలారంలు కూడా వచ్చాయి... అయినా ఈ సైరన్ శబ్దం తోనే తమకు సమయం సులభంగా తెలుసుకొనే వీలు ఉందని కార్మికులు చెప్పడం విశేషం.

Andhra-pradesh: ఒంగోలులో ప్రత్యేక సైరన్‌.. 57ఏళ్ల ప్రస్థానం.. విశేషం ఏంటో తెలిస్తే..
Ongole
Follow us on

ఒంగోలులో ఆ సైరన్ ఉంటే చాలు… ఇక గడియారం అవసరం లేనట్టే… కార్మికులకైతే ఆ సైరన్‌తోనే తెల్లవారుతుంది… కోడికూత పెట్టడం అయినా ఆలస్యమవుతుందేమో కానీ, ఆ సైరన్‌ మాత్రం టంఛన్‌గా ఉదయం 5 గంటల కల్లా చెవిలో జోరిగలా మోగుతుంది… ఆ సైరన్‌ శబ్దం నగర ప్రజలను మేలు కొలుపుతోంది. 1966 వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ సైరన్ కార్మికులకు గడియారం అవసరం లేని సమయం తెలుపుతుంది… కార్మికుల పని వేళలకు కొలమానంగా ఉపయోగపడేది… దీంతో ఇది కార్మికుల సైరన్ గా మారిపోయింది… అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకు 5 సార్లు మోగుతూ ప్రజలను ఈ సైరన్ పలకరిస్తుంది… ప్రకాశంజిల్లా కేంద్రం ఒంగోలులోని కొండపై ఈ సైరన్‌ను 1966 లో ఏర్పాటు చేశారు… అప్పట్లో చేతి గడియారాలు అంతగా లేని కాలం కావడంతో నగరంలో పనిచేస్తున్న కార్మికులకు సమయాన్ని తెలిపేందుకు నాడు కొండపై ఓ సైరన్ ఏర్పాటు చేశారు. నేటికీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు ఈ సైరన్ ను వినియోగిస్తున్నారు..

ఈ సైరన్ ఉదయం 5 గంటలకు, ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, తిరిగి రాత్రి 8 గంటలకు మోగుతుంది. ఈ సైరన్ ద్వారా నగరంలోని కార్మికులకు నాడు పని వేళలు తెలిసేవి… ఉదయం సైరన్ మోగిన వెంటనే కార్మికులు తమ తమ పనులకు పరుగులు పెట్టేవారు… సైరన్ ఏర్పాటు చేసిన సమయంలో చేతి గడియారాలు, మొబైల్ ఫోన్లు లేని కాలం కావడంతో సైరన్ ఆధారంగానే కార్మికులు పనులు నిర్వహించేవారు… నాటి నుండి నేటి వరకు ఈ సైరన్ నగర ప్రజలను మేలుకొలుపుతూనే ఉంది…

కొండమీద ఓల్డ్ ఫిల్టర్ బెడ్ దగ్గర పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది రోజుకు ఐదు సార్లు ఈ సైరన్ ను మ్రోగిస్తారు. ప్రస్తుతం కాలం మారింది… చేతులకు గడియారాలు వచ్చాయి, పోయాయి… మొబైల్ ఫోన్లలో సయయంతో పాటు అలారంలు కూడా వచ్చాయి… అయినా ఈ సైరన్ శబ్దం తోనే తమకు సమయం సులభంగా తెలుసుకొనే వీలు ఉందని కార్మికులు చెప్పడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..