AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gubbala Mangamma Talli: ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్.. ఎందుకో తెలిస్తే తప్పక వెళ్లి దర్శించుకుంటారు..!

10 to 5 ఈ టైమింగ్ సహజంగా స్కూల్ పిల్లలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తుంది. ఇక ఆసుపత్రులైతే 24 గంటలు పని చేస్తాయి. ఆలయాల్లో సైతం దేవుడిని తెల్లవారుజామున సుప్రభాతం తర్వాత నుంచి రాత్రి పవలింపు సేవ వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. కానీ ఏపీ లోని ఆ గుడి మాత్రం ప్రత్యేకం.

Gubbala Mangamma Talli: ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్.. ఎందుకో తెలిస్తే తప్పక వెళ్లి దర్శించుకుంటారు..!
Gubbala Mangamma Talli Temple
B Ravi Kumar
| Edited By: Shiva Prajapati|

Updated on: Jul 27, 2023 | 6:49 PM

Share

10 to 5 ఈ టైమింగ్ సహజంగా స్కూల్ పిల్లలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తుంది. ఇక ఆసుపత్రులైతే 24 గంటలు పని చేస్తాయి. ఆలయాల్లో సైతం దేవుడిని తెల్లవారుజామున సుప్రభాతం తర్వాత నుంచి రాత్రి పవలింపు సేవ వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. కానీ ఏపీ లోని ఆ గుడి మాత్రం ప్రత్యేకం. సాయంత్రం 5 గంటల తరువాత నరమానవుడు అక్కడ కనిపించడు. ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని సైతం మూసివేస్తారు. అసలా గుడిలో దైవాన్ని సూర్యాస్తమయం తరువాత ఎందుకు దర్శించుకోకూడదు, భక్తులు ఎందుకు ఆ సాహసం చేయరు. తెలుసు కోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే..

ఏలూరు..

తెలంగాణలో సమ్మక్క సారక్క వనజాతర అందరికీ తెలిసిందే. ఇలాగే ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలమంగమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభువని చెబుతారు. పూర్తిగా గిరిజన గ్రామాలు మీదుగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రా ప్రాంతాల ప్రజలు ఆలయానికి చేరుకుంటారు.

గుబ్బల మంగమ్మ స్థలపురాణం..

ఇక్కడ స్థానికులు చెప్పే వివరాలు ప్రకారం గుబ్బల మంగమ్మ ఆలయం త్రేతాయుగం నుంచి ఉంది ఉంది. సీతారాములు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నట్లు చెబుతారు. అలాగే పాండవులు అజ్ఞాతవాసంలోనూ ఇక్కడ సంచరించినట్లు కథనాలు ఉన్నాయి. ఇక కొన్ని దశాబ్ధాల క్రితం బుట్టాయగూడెంకు చెందిన వెదురు కర్రలు వ్యాపారి కరాటం క్రృష్ణమూర్తి తన అనుచరులతో ఈ ప్రాంతం నుంచి ఎద్దుల బండ్లపై కలప తీసుకువస్తున్నారట. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయం ప్రాంతానికీ రాగానే బండ్లు ఎంత ప్రయత్నం చేసినా కదలకపోవడంతో అక్కడే వాటిని వదిలి ఇంటికి వెళ్లి పోయారట. అదే రోజు రాత్రి క్రృష్ణమూర్తి కలలో కనిపించి తాను అక్కడే కొండల్లో వెలిసి ఉన్నట్లు చెప్పిందట. గుబ్బల మంగమ్మ దేవత గురించి మరో కథనం ప్రకారం పూర్వం రాక్షసులు మధ్య భీకర యుద్ధం జరిగిందంట. ఆసమయంలో తన ఆలయం కూలిపోవడంతో ఆగ్రహంతో గుబ్బల మంగమ్మ రాక్షసులు అందరినీ సంచరించినట్లు చెబుతున్నారు. అందుకే గొడుగు ఆకారంలో ఉన్న కొండగుహలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. గుహ పై భాగం గుబ్బలు గుబ్బలుగా ఉంటుంది. అందుకే మంగమ్మ తల్లి ఆలయాన్ని గుబ్బల మంగమ్మ ఆలయంగా పిలువబడుతుంది. ఈ వృత్తాంతం తెలుసుకున్న క్రృష్ణమూర్తి తెల్లవారగానే స్ధానికులుతో కలిసి అక్కడకు చేరుకుని శిధిలదశలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని గుర్తించి ఆలయంగా మలిచి పూజలు చేయటం ప్రారంభించారు.

దట్టమైన అరణ్యంలో ఆలయం..

బుట్టాయగూడెం ఏజెన్సీలో దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలమంగమ్మ ఆలయం ఉంటుంది. జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట మీదుగా అమ్మవారి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. అయితే ఆలయం దారిలో కొండవాగులు వర్షాకాలంలో పొంగిపొర్లుతుండటంతో. దీంతో వర్షాలు అధికంగా పడే సమయంలో ఆలయంలోకి భక్తులను అనుమతించరు. అదేవిధంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏమాత్రం అక్కడ పని చేయవు. దీంతో పాటు జనసంచారం, నివాసాలకు దూరంగా ఉన్న ప్రాంతం కావటంతో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల తరువాత భక్తులు ఎవ్వరినీ ఆలయ పరిసరాల్లో ఉండనివ్వరు. గుడికి వెళ్లే దారులను సైతం మొదట్లోనే మూసివేస్తారు.

ఎవరి పూజలు వాళ్లే చేసుకోవాలి..

గుబ్బల మంగమ్మ ఆలయం పూర్తిగా అక్కడ ఉండే గిరిజనుల అధీనంలోనే ఉంటుంది. అక్కడే స్ధానికులు కమిటీగా ఏర్పడి ఆలయం నిర్వహణ చూస్తారు. అయితే ఇక్కడ పూజారుల విధానం లేదు. ఎవరికి వారు అమ్మవారిని దర్శించుకుని, నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. గతంలో గుహలోపలకి వెళ్లి అమ్మవారి విగ్రహానికి నేరుగా పూజలు చేసేవారు. అయితే, ప్రస్తుతం గుహ మొదట్లోనే ఐరన్ గ్రిల్స్ వేయటంతో బయట నుంచే అమ్మ వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. అక్కడ ఉండే గానుగ చెట్టుకు ముడుపులు చెల్లిస్తారు.

వాటర్ ఫాల్స్ మధ్యలో అమ్మవారు..

మండుటెండల్లో సైతం అమ్మవారు కొలువుతీరిన గుహపై నుంచి నీరు జాలువారుతుంటుంది. బండలు, కొండరాళ్ల మధ్యలో నీళ్లపాయలో నడుచుకుంటూ వెంటి జలపాతాల్లో తడుస్తూ భక్తులు దేవతను దర్శించుకుంటారు. ఏమాత్రం బాహ్య ప్రపంచానికి సంబంధంలేని అటవీ ప్రాంతంలో అందమైన పచ్చటి చెట్లు, జలపాతాల మధ్య కొలువైన వనదేవత గా గుబ్బల మంగమ్మ ఆలయం ఖ్యాతి పొందింది.

ఇక్కడ ప్రకృతి దేవత గుబ్బల మంగమ్మ. అందమైన వనాలను కాపాడుకుంటే ఆధ్యాత్మిక వాతావరణం పదిలంగా ఉంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఫోన్ చూస్తూ తింటున్నారా.. మీరు డేంజర్‌లో ఉన్నట్లే.. ఈ సమస్యలు..
ఫోన్ చూస్తూ తింటున్నారా.. మీరు డేంజర్‌లో ఉన్నట్లే.. ఈ సమస్యలు..
పుష్ప2 రికార్డు బ్రేక్ చేసిన బాలీవుడ్ యాక్షన్ సినిమా!
పుష్ప2 రికార్డు బ్రేక్ చేసిన బాలీవుడ్ యాక్షన్ సినిమా!
మరో వారంలో NTPC రైల్వే రాత పరీక్షలు.. ఉచిత మాక్‌ టెస్ట్‌ లింక్
మరో వారంలో NTPC రైల్వే రాత పరీక్షలు.. ఉచిత మాక్‌ టెస్ట్‌ లింక్
ట్రంప్‌ బాటలో మరో దేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!
ట్రంప్‌ బాటలో మరో దేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!
నెపోటిజంపై స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్లు!
నెపోటిజంపై స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్లు!
కుప్పకూలిన అహోబిలం ఆలయం.. భారతీయుడి సహా, మరో ముగ్గురు మృతి!
కుప్పకూలిన అహోబిలం ఆలయం.. భారతీయుడి సహా, మరో ముగ్గురు మృతి!
మసక మసక చీకటిలో.. కొత్త వెర్షన్ విన్నారా..?
మసక మసక చీకటిలో.. కొత్త వెర్షన్ విన్నారా..?
చేతిలో డబ్బు నిలవడంలేదా.. సంపదను అడ్డుకునే మీ ఇంట్లోని వాస్తు..
చేతిలో డబ్బు నిలవడంలేదా.. సంపదను అడ్డుకునే మీ ఇంట్లోని వాస్తు..
చానెల్‌ షో ప్రారంభించిన తొలి ఇండియన్‌ మోడల్‌ భవిత.. వీడియో వైరల్
చానెల్‌ షో ప్రారంభించిన తొలి ఇండియన్‌ మోడల్‌ భవిత.. వీడియో వైరల్
ఏం జరిగినా సిక్సర్లు కొట్టడం ఆపొద్దు.. కెప్టెన్ స్ట్రిక్ ఆర్డర్
ఏం జరిగినా సిక్సర్లు కొట్టడం ఆపొద్దు.. కెప్టెన్ స్ట్రిక్ ఆర్డర్