Andhra Pradesh: ఇది చూశాక కూడా విహార యాత్రకు వెళతారా?… తీర్థయాత్రకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
ఏపీలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. పట్టపగలే ఇళ్లు లూఠీ చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొంతమూరు భవానిపురంలో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక పంతులు గరిమెళ్ళ పవన్ కుమార్ ఇంట్లో బంగారు నగలు...

ఏపీలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. పట్టపగలే ఇళ్లు లూఠీ చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొంతమూరు భవానిపురంలో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక పంతులు గరిమెళ్ళ పవన్ కుమార్ ఇంట్లో బంగారు నగలు, వెండి, నగదును దుండగులు దోచుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు, తాళాలు పగలగొట్టి బీరువాలోని నగలు, వెండి వస్తువులు, నగదు అపహరించారు దుండగులు.
శ్రీశైలం వెళ్లి తిరిగి వచ్చేసరికి ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. దాదాపు 20 కాసులు బంగారు ఆభరణాలు, వెండి కంచాలు, వెండి బిందెలు, కనక సెల్లు, కాసులపేరు, నెక్లెస్, బంగారపు కడియం, ఉంగరాలు, నగదు, 2.5 కేజీల వెండి వస్తువులు పోయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గరిమెళ్ళ పవన్ కుమార్ కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు క్రైమ్ క్లూస్ టీం పోలీసులు.
ప్రజలు lhms అలారం సిస్టమ్ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు. ఎక్కడికైనా దేవాలయాలకు, విహారయాత్రలకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చి వెళ్లాలని సూచించారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. అపరిచుతల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.




