బాధితుని ఫోన్ నుంచే లక్ష కొట్టేసిన కేటుగాడు.. ఎలాగంటే..

అతని పేరు రాము.. వయస్సు 70 ఏళ్లు.. తన కుమారుడు ఉమామహేశ్వరావుతో కలిసి మూడు రోజుల క్రితం మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చారు. తండ్రికొడుకులిద్దరూ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. అదే సమయంలో ఇద్దరు యువకులు బైక్‎పై వచ్చారు.

బాధితుని ఫోన్ నుంచే లక్ష కొట్టేసిన కేటుగాడు.. ఎలాగంటే..
Mangalagiri
Follow us

| Edited By: Srikar T

Updated on: Aug 20, 2024 | 9:30 PM

అతని పేరు రాము.. వయస్సు 70 ఏళ్లు.. తన కుమారుడు ఉమామహేశ్వరావుతో కలిసి మూడు రోజుల క్రితం మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చారు. తండ్రికొడుకులిద్దరూ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. అదే సమయంలో ఇద్దరు యువకులు బైక్‎పై వచ్చారు. అక్కడే ఉన్న రాము ఫోన్ చూసుకుంటూ వచ్చిందెవరా అంటూ చూశారు. అంతే.. క్షణాల్లో అతని చేతుల్లోని ఫోన్ లాక్కొని అక్కడ నుండి ఉడాయించారు. ఊహించని పరిణామంతో అవాక్కైన రాము ఫోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నారు.

అయితే పనుల హాడావుడిలో స్టేషన్‎కు వెళ్లడం కుదరలేదు. రెండు రోజులు గడిచిన తర్వాత రాము బ్యాంక్ వెళ్లి అకౌంట్‎లో డబ్బులు తీయడానికి ప్రయత్నించగా లక్షల రూపాయలు డ్రా చేసినట్లు సిబ్బంది చెప్పారు. దీంతో రాము మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. వెంటనే తన ఫోన్ పోయిన విషయం గుర్తుకొచ్చింది. దుండగులు ఫోన్ కొట్టేసిన రోజు మూడు విడతలగా లక్ష రూపాయలను అకౌంట్ నుండి డ్రా చేసినట్లు తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

ఫోన్ దొంగలించి దాని ద్వారా లక్ష రూపాయలు డ్రా చేసుకున్నట్లు రాము ఫిర్యాదు చేశాడు. అయితే ఫోన్‎కు సింపుల్ పాస్ వర్డ్ పెట్టడంతోనే దొంగలు సులభంగా ఫోన్ పే నుండి డబ్బులు మళ్లించుకున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. సిసి కెమెరా విజువల్స్ ద్వారా ఫోన్ కొట్టేసిన వారిలో ఒకరిని గుర్తించారు. ప్రస్తుతం వీరి కోసం మంగళగిరి పోలీసులు గాలింపు చేపట్టారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి ఆప్‎లతో పాటు ఫోన్‎కు స్ట్రాంగ్ పాస్ వర్డ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వరుస నంబర్స్‎ను పాస్ వర్డ్‎గా పెట్టుకోవడంతోనే రాము ఖాతా నుండి డబ్బులు మళ్లించుకోవడం సులభతరమయిందని తెలిపారు. సైబర్ నేరగాళ్ళతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంతో పాటు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలంటున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాధితుని ఫోన్ నుంచే లక్ష కొట్టేసిన కేటుగాడు.. ఎలాగంటే..
బాధితుని ఫోన్ నుంచే లక్ష కొట్టేసిన కేటుగాడు.. ఎలాగంటే..
తెలంగాణలో దుమ్ముదుమారం.. రాజీవ్ విగ్రహం చుట్టూ రాజకీయం
తెలంగాణలో దుమ్ముదుమారం.. రాజీవ్ విగ్రహం చుట్టూ రాజకీయం
బంగ్లాకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ జరిగేది ఎక్కడంటే?
బంగ్లాకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ జరిగేది ఎక్కడంటే?
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం..
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం..
బాబోయ్‌ వాన..!హైదరాబాద్‌ను వణికిస్తున్న వరుణుడు.జీహెచ్‌ఎంసీఅలర్ట్
బాబోయ్‌ వాన..!హైదరాబాద్‌ను వణికిస్తున్న వరుణుడు.జీహెచ్‌ఎంసీఅలర్ట్
సీఎం చంద్రబాబుతో వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ..
సీఎం చంద్రబాబుతో వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ..
ఈ ఫొటోలో ఉన్న బుజ్జాయిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న బుజ్జాయిని గుర్తుపట్టారా.?
చదివింది ఇంటర్.. సినీ బ్యాగ్రౌండ్ కూడా లేదు.. కానీ
చదివింది ఇంటర్.. సినీ బ్యాగ్రౌండ్ కూడా లేదు.. కానీ
వీళ్ల కెరీర్‌లో 'గోల్డెన్ పీరియడ్' క్లోజ్.. ఛాన్స్‌లు రావడం కష్టం
వీళ్ల కెరీర్‌లో 'గోల్డెన్ పీరియడ్' క్లోజ్.. ఛాన్స్‌లు రావడం కష్టం
పంచాయతీలకు గుడ్ న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..
పంచాయతీలకు గుడ్ న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..