AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Panduri: పండూరి మామిడిపండు.. సీజన్‌లో ఒక్కసారైన దీన్ని తినాల్సిందే.. ఇంతకు దాని ప్రత్యేకత ఏంటో తెలుసా!

వేసవికాలం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే తమకు ఇష్టమైన మామిడి పండ్లు అప్పుడే దొరుకుతాయి కాబట్టి. అలా చాలా మంది ఎదరు చూసే పండు ఈ "పందూరు మామిడి పండు" సీజన్ వచ్చిందటే చాలు ఈ పండ్లకు ఎక్కడలేని గిరాకీ వస్తుంది. కొందరైతే ఇవి కాయగా ఉన్నప్పుడే బుక్‌ చేసుకుంటారట, వీటిని వీఐపీలు, సెలబ్రిటీలకు గిఫ్ట్‌గా కూడా ఇస్తుంటారట.. అసలు ఈ పండుకు ఎందుకు అంత డిమాండో తెలుసుకుందాం పదండి..

Mango Panduri: పండూరి మామిడిపండు.. సీజన్‌లో ఒక్కసారైన దీన్ని తినాల్సిందే.. ఇంతకు దాని ప్రత్యేకత ఏంటో తెలుసా!
Mango Panduri
B Ravi Kumar
| Edited By: |

Updated on: May 08, 2025 | 10:30 AM

Share

వేసవికాలం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే తమకు ఇష్టమైన మామిడి పండ్లు అప్పుడే దొరుకుతాయి. మంచి రుచికరమైన మామిడి పండ్లు ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంటుంది . వీటిలో ఎక్కువగా దొరికేవి, అందరూ తినేవి రసాలు, బంగినపల్లి, తోతాపురి ఇలా రకాన్ని ఎంచుకుని ఆ వెరైటీ కోసం ఎక్కడికైనా వెళ్తారు, ఎంత రేటైనా లెక్కచేయకుండా కొంటారు. మామిడి పండ్ల సీజన్ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి అరుదుగా దొరికే పందూరు మామిడి పండ్ల రకంపై పడింది. ఈ రకం మామిడి పండుకు మార్కెట్లో గిరాకీ ఉండడంతో ఒక్కో పండు ధర సైజు ప్రకారం రూ. 30 నుంచి రూ. 50 వరకు ధర పలుకుతోంది. అరుదుగా దొరికే ఈ పళ్లు బరువు 300 గ్రాముల వరకు ఉంటుందని మామిడి రైతులు చెబుతున్నారు.

చూసేందుకు పచ్చిగా ఉండే పందూరు మామిడిపళ్లు ఉభయగోదావరి జిల్లాల్లో ఉండ్రాజవరం, జంగారెడ్డిగూడెం, మొగల్తూరు ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. సీజన్‌లో ఒక్కసారైనా పందూరు మామిడిపండు తిని తీరాలి అంటారు పెద్దలు. చూడడానికి చిన్న కాయ అయినా దాని టేస్ట్ ఆ రేంజ్‌లో ఉంటుంది మరి.

ఈ పళ్లను.. పూత దగ్గర నుండి కాయ పక్వానికి వచ్చే వరకూ చాలా భద్రంగా చూసుకుంటారు రైతులు. రైతు వద్ద పొందూరు మావిడి ఉందని తెలిస్తే ముందే అడ్వాన్స్‌లు ఇచ్చి మరీ కాయలను బుక్ చేసుకుంటారు కావాలసిని వాళ్లు. పక్వానికి వచ్చిన పందూరు మామిడిపండు పండ్లను అధికారులు, రాజకీయనాయకులు, వీఐపీలకు బహుమతిగా పంచిస్తుంటారు. ఇక్కడ కాచిన పందూరు మామిడిపండు ఢిల్లీ వరకూ వెలుతుంది.

పందూరు మామిడిపండు సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఒక్క సారి దీని టేస్ట్ చేసిన వారెవరైనా మరొకటి కావాలని అడగాల్సిందే. అలా ఉంటుంది మరి దీని రుచి. ఇంత అమోఘమైన పండు కోసం ఎంతరేటైన పెడతారు మామిడి ప్రియులు. పూర్వం మహారాజులు వీటిని ఇష్ట పూర్వకంగా తినేవారట. మరి ఇంకెందుకు ఆలస్యం పందూరు మామిడి రుచి చూసేయండి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?