Andhra Pradesh: ఫిషింగ్ హార్బర్‌లో టెన్షన్ టెన్షన్.. కంటైనర్ టెర్మినల్ వద్ద నిలిచిపోయిన వందలాది వాహనాలు..
Visakhapatnam Fishing Harbour: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భూములు అప్పగించిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ధర్నాకు దిగి నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. కంటైనర్ టెర్మినల్ ప్రవేశద్వారం ముంగిట పెద్ద సంఖ్యలో మత్యకారులు బైఠాయించారు.
Visakhapatnam Fishing Harbour: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భూములు అప్పగించిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ధర్నాకు దిగి నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. కంటైనర్ టెర్మినల్ ప్రవేశద్వారం ముంగిట పెద్ద సంఖ్యలో మత్యకారులు బైఠాయించారు. దీంతో కంటైనర్ల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో.. ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు. కంటైనర్ నిర్మాణానికి.. భూములిచ్చిన మత్స్యకారులకు 60 గజాల ఇంటి స్థలం, లక్ష రూపాయల పరిహారం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే 20 ఏళ్లు అయినా ఇంత వరకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని మత్స్యకారులు నిరసనకు దిగారు.
ధర్నా దృష్ట్యా కంటైనర్ టెర్మినల్‌కు వెళ్లే ప్రధాన మార్గాన్ని మార్గాన్ని పోలీసులు దిగ్బంధించారు. మత్స్యకారుల ఆందోళనకు టీడీపీ, సీఐటీయూ నేతలు మద్దతు తెలిపారు. దీంతో విశాఖలో మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. కంటైనర్ టర్మినల్ అవుట్ గేట్ దగ్గర ఉద్రికత్త నెలకొంది. రోడ్డుపై భైఠాయించిన మత్స్యకారులు సమస్యలు పరిష్కరించే వరకు ఒక్క వాహనం కూడా లోపలికి పంపేది లేదంటూ నిరసనకు దిగారు. దీంతో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. లోడింగ్ అన్‌లోడింగ్ జరగకపోవడంతో కిలోమీటర్ల మేర కంటైనర్లు నిలిచిపోయాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..