Andhra Pradesh: మరో మట్టిలో మాణిక్యం.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని అనుకున్న లక్ష్యాన్ని సాధించింది..
తండ్రి కరోనాతో చనిపోయారు. తల్లికి అనారోగ్యం. అక్కకు క్యాన్సర్. మరోవైపు ఆమెకు పెళ్ళయింది. అయినా కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆ వివాహిత లక్ష్యం ముందు ఇవేవి అడ్డుకాలేదు. పుట్టింట్లో పుట్టెడు కష్టాలు పడినప్పటికీ.. మెట్టినింట మాత్రం ఆమె లక్ష్యానికి మద్దతు లభించింది. ఆమెను అర్ధం చేసుకున్న భర్త దొరకడంతో పాటు అత్తింటివారి ప్రోత్సాహం కూడా తోడు కావడంతో తాను చిన్పప్పటి నుంచి పోలీస్ కావాలన్న కలను నెరవేర్చుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మట్టిలో మాణిక్యం అనే పదానికి ఈ యువతి సరిగ్గా సరిపోతుంది.
తండ్రి కరోనాతో చనిపోయారు. తల్లికి అనారోగ్యం. అక్కకు క్యాన్సర్. మరోవైపు ఆమెకు పెళ్ళయింది. అయినా కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆ వివాహిత లక్ష్యం ముందు ఇవేవి అడ్డుకాలేదు. పుట్టింట్లో పుట్టెడు కష్టాలు పడినప్పటికీ.. మెట్టినింట మాత్రం ఆమె లక్ష్యానికి మద్దతు లభించింది. ఆమెను అర్ధం చేసుకున్న భర్త దొరకడంతో పాటు అత్తింటివారి ప్రోత్సాహం కూడా తోడు కావడంతో తాను చిన్పప్పటి నుంచి పోలీస్ కావాలన్న కలను నెరవేర్చుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మట్టిలో మాణిక్యం అనే పదానికి ఈ యువతి సరిగ్గా సరిపోతుంది. పరుగును నమ్ముకొని ఏకంగా ఎస్సై పోస్ట్ కొట్టేసింది. తండ్రి కరోనాతో చనిపోయిన బాధను భరిస్తూనే పరీక్షలు రాసి అనుకున్న గమ్యానికి చేరుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం పంచాయతీ ద్వారకచర్ల గ్రామానికి చెందిన బొడ్డు జ్యోతి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సైగా ఉద్యోగం సాధించింది.
చిన్నప్పటి నుంచి ఎస్సై కావాలన్న తన కలను నెరవేర్చుకుంది. మొదటినుంచి అథ్లెటిక్స్‌పై ఆసక్తి పెంచుకున్న జ్యోతి.. పరుగుల రాణిగా పేరు తెచ్చుకుంది. 400 మీటర్ల పరుగు పందెలలో ఎన్నో మెడల్స్ సాధించింది. చిన్నప్పటినుంచి తన తండ్రి వెంకట రమణారెడ్డి కూడా ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. నిరంతరం పరుగు పందాలలో పాల్గొనడం వల్ల ఆ పరుగు తనకు ఎస్సై జాబ్ సాధించేందుకు ఉపయోగపడింది. ఇక రెండు సంవత్సరాల క్రితమే తన తండ్రి కరోనాతో మృతి చెందారు. తల్లికి ఆరోగ్యం బాగో లేదు. మరోవైపు అక్కకు క్యాన్సర్ వచ్చింది. దీంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆమె తన లక్ష్యాన్ని ఛేధించింది. మొదటినుంచి తన కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ వచ్చింది. తల్లిదండ్రులతో పాటు తన భర్త శ్రీధర్ రెడ్డి.. ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో తన లక్ష్యాన్ని సాధించానని జ్యోతి ఎంతో ఆనందంగా తెలిపింది.
2022వ సంవత్సరంలో తాను ఎస్సై పరీక్షలు రాయగా 2023 ఆగస్టులో ఫలితాలు వచ్చాయని అందులో తాను ఎస్సైగా సెలెక్ట్ అయ్యారని తెలిపింది. తల్లిదండ్రులు, భర్త, అత్తమామలు తనలాగే యువతను ప్రోత్సహిస్తే వారు అనుకున్నది సాధిస్తారని బొడ్డు జ్యోతి చెబుతోంది. ఇదిలా ఇప్పటికే చాలామంది యువత తాము అనుకున్నది సాధించలేకపోయామని ఎంతగానో మనస్తాపం చెందుతారు. ఇక జీవతం అయిపోయిందని అని అనుకుంటారు. మరికొందరైతే ఆత్మహత్యలు కూడా చేసుకునేందుకు వెనకాడరు. అయితే పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరుపిస్తున్నారు జ్యోతీ లాంటి యువతీ, యువకులు. ఇలాంటి వారు కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కావడం మరో విశేషం. ఇదిలా ఉండగా జ్యోతి అనుకున్న లక్ష్యం సాధించడంతో ఆమె బంధు, మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.