Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యాక్‌ ర్యాంకింగ్‌ కేసులో 10 మందికి రిమాండ్.. నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలింపు

న్యాక్‌ ర్యాంకింగ్‌ కేసులో 10 మందికి రిమాండ్ విధించింది కోర్టు. 10 మంది నిందితులకు 15 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. న్యాక్‌ ర్యాంకింగ్‌ స్కామ్‌లో నిన్న దేశవ్యాప్తంగా CBI సోదాలు నిర్వహించింది. కేఎల్ యూనివర్శిటీ ఛైర్మన్‌తోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. న్యాక్‌ A++ రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు KL ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ వైస్‌చాన్సలర్‌ GP సారథివర్మను CBI అరెస్ట్ చేసింది.

న్యాక్‌ ర్యాంకింగ్‌ కేసులో 10 మందికి రిమాండ్.. నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలింపు
Kl University
Follow us
K Sammaiah

|

Updated on: Feb 02, 2025 | 2:05 PM

న్యాక్‌ ర్యాంకింగ్‌ కేసులో 10 మందికి రిమాండ్ విధించింది కోర్టు. 10 మంది నిందితులకు 15 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. న్యాక్‌ ర్యాంకింగ్‌ స్కామ్‌లో నిన్న దేశవ్యాప్తంగా CBI సోదాలు నిర్వహించింది. కేఎల్ యూనివర్శిటీ ఛైర్మన్‌తోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. న్యాక్‌ A++ రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు KL ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ వైస్‌చాన్సలర్‌ GP సారథివర్మను CBI అరెస్ట్ చేసింది. అలాగే వైస్‌ ప్రెసిడెంట్‌ కోనేరు రాజా హరీన్‌తోపాటుహైదరాబాద్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ రామకృష్ణ కూడా అరెస్ట్‌ అయ్యారు.

దేశవ్యాప్తంగా 20చోట్ల విద్యాసంస్థల్లో CBI సోదాలు చేసింది. న్యాక్‌ A++ అక్రిడేషన్‌ కోసం విద్యాసంస్థల ప్రతినిధులు- ఇన్‌స్పెక్షన్‌ కమిటీకి లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో CBI పంజా విసిరింది. లంచాలు ఇచ్చినవారిని, తీసుకున్నవారిని అరెస్ట్ చేశారు. ఈ సోదాల తర్వాత 10 మందిని CBI అరెస్ట్‌ చేసింది. 14 మందిపై కేసు నమోదు చేసింది. న్యాక్‌ ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌కు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో, గుంటూరుకు చెందిన KL ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ వైస్‌ చాన్సలర్‌ GP సారథి వర్మ అరెస్ట్‌ అయ్యారు. ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ కోనేరు రాజా హరీన్‌, హైదరాబాద్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ రామకృష్ణను కూడా CBI అరెస్ట్‌ చేసింది.

అంతేగాదు, వీరి నుంచి లంచాలు తీసుకున్న న్యాక్‌ ఇన్‌స్పెక్షన్‌ బృందంలోని చైర్మన్‌ సురేంద్రనాధ్‌ సాహాతోపాటు, ఆ బృందంలోని ఏడుగురిని కూడా CBI అరెస్ట్‌ చేసింది. నగదు, బంగారం, సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ల రూపంలో లంచాల బాగోతం నడిచినట్లు CBI గుర్తించింది. ఈ సోదాల్లో 37 లక్షల రూపాయల నగదును, ఆరు ల్యాప్‌టాప్‌లను, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై, విజయవాడ, బెంగళూరు, భోపాల్, ఢిల్లీలో సోదాలు చేపట్టిన తర్వాత, CBI ఈ అరెస్టులు చేసి, కేసులు నమోదు చేసింది.

న్యాక్‌ రేటింగ్‌ ఎలా ఇస్తుంది?

విద్యాసంస్థల్లో అన్ని ప్రమాణాలు పాటిస్తున్నారా.. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారనే దాన్ని బేస్ చేసుకుని న్యాక్‌ రేటింగ్‌ ఇస్తూ ఉంటుంది. వర్సీటీలు, కాలేజీలకు ఈ రేటింగ్‌ను చాలా కీలకంగా భావిస్తాయి.. అందుకే అడ్డదారిలో అక్రిడిటేషన్‌ రేటింగ్స్‌ కోసం ఇలా లంచాలు ఇస్తుంటాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూసినా ఈసారి న్యాక్‌ ఇన్‌స్పెక్షన్‌ బృందం చైర్మన్‌ సహా ఆ టీమ్‌లోని ఏడుగురు అరెస్ట్‌ అవడం సంచలనంగా మారింది. ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తూ లంచాలిస్తే రేటింగ్ ఇస్తున్నారనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

న్యాక్‌ రేటింగ్‌లో A++ అంటే టాప్ అన్నట్టు లెక్క. ఆ తర్వాత A+, B++ ఇలా రేటింగ్‌ ఇస్తారు. కొన్ని వర్సిటీల్లో ల్యాబ్‌లు, టీచింగ్ స్టాఫ్‌ లాంటి విషయాల్లో అరకొర ప్రమాణాలే పాటిస్తూ.. అడ్డదారుల్లో రేటింగ్‌ పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో CBI రంగంలోకి దిగడం.. పలువురిని అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి.