AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇన్ని రోజులు రోజా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ మంత్రులను బర్తరఫ్ చేయాలి.. నారీ సంకల్ప దీక్షలో వంగలపూడి అనిత..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగల పూడి అనిత ఆరోపించారు. 

Andhra Pradesh: ఇన్ని రోజులు రోజా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ మంత్రులను బర్తరఫ్ చేయాలి.. నారీ సంకల్ప దీక్షలో  వంగలపూడి అనిత..
Vangalapudi Anitha
Basha Shek
|

Updated on: Jan 31, 2022 | 1:42 PM

Share

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan ReddY) పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగల పూడి అనిత (Vangalapudi Anitha )ఆరోపించారు.  మహిళలపై అఘాయిత్యాలు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమె టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారీ సంకల్ప దీక్షను చేపట్టారు. నేటి సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.  ఈ సందర్భంగా టీవీ9 తో మాట్లాడిన అనిత జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో ఆడవారికి రక్షణ కరువైందని మంత్రులు, ఎమ్మెల్యేలపై  ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘వైసీపీ ఎమ్మెల్యే రోజా కు మతి భ్రమించింది.  ఆమె వనజాక్షి, రితికేశ్వరి ఘటన ల గురించి తప్ప మరేమీ మాట్లాడదు.  నన్ను కించపరిచి  మాట్లాడినందుకే అసెంబ్లీ రూల్స్ ప్రకారం శాసనసభ నుంచి రోజాను సస్పెండ్ చేశారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో ఆడపిల్లలపై అత్యాచార ఘటనలు జరిగితే ఆమె ఎందుకు స్పందించలేదో కారణం చెప్పాలి. రమ్య, అనూష ..ఇన్ని ఘటన లు జరిగితే కొవ్వొత్తుల ర్యాలీ ఎందుకు చేయలేదు. ఆమె  జబర్దస్త్ డైలాగులు మాట్లాడితే వినేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరు  ఎపుడు బయటకు రాని  ఆమె ఈరోజు మాత్రం మాట్లాడుతోంది. ఏదేమైనా రోజా మాట్లాడడం మంచిదే.  విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటన జరిగిన వెంటనే టీడీపీ మహిళా నేతలు వెళ్లి బాధితులను పరామర్శించారు.  రాష్ట్రంలో కొందరు మంత్రులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు.  గుడివాడలో కేసినో నిర్వహించిన మంత్రి కొడాలి నాని ని  వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలి. అదేవిధంగా రాసలీలల అంబటి రాంబాబు, అరగంట మంత్రులను తక్షణమే బర్తరఫ్ చేయాలి.  విజయవాడ చిన్నారి కేసులో నిందితుడైన వినోద్ జైన్ మంత్రి వెల్లంపల్లి శిష్యుడు. ఈ ఘటన జరిగిన వెంటనే మేము  బాధ్యతగా పార్టీ  నుంచి అతనిని సస్పెండ్ చేశాం.  మహిళలు పై అఘాయిత్యాల ఘటన లపై చర్చకు నేను రెడీగా ఉన్నాను..మీలో ఎవరు వస్తారో రండి’ అని ఆమె సవాల్ విసిరారు.

Also read:Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో ఇవే కీలకం.. ఈ 10 విషయాలలో తెలుసుకోండి..

Kim Jong un: కిమ్‌ టాయిలెట్‌కు సెక్యూరిటీ గార్డ్స్‌.. అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..

KTR: కనీసం ఈ బడ్జెట్ లోనైనా తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయండి.. కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి..