Krishna Water: మరోసారి కృష్ణా రివర్ బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం.. అనధికార ప్రాజెక్టులకు నీళ్లు తరలిస్తు్న్నారని ఫిర్యాదు

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది.కృష్ణా జలాల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే అడ్డుకోవాలని కోరింది.

Krishna Water: మరోసారి కృష్ణా రివర్ బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం.. అనధికార ప్రాజెక్టులకు నీళ్లు తరలిస్తు్న్నారని ఫిర్యాదు
Srisailam Dam Water
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 12, 2021 | 3:01 PM

Krishna Water Dispute: కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది.కృష్ణా జలాల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే అడ్డుకోవాలని కోరింది.మచ్చుమర్రి ఎత్తిపోతల, మల్యాల పంపింగ్ స్టేషన్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏపీ నీటి తరలింపును ఆపాల్సిందిగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. సరైన కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్ట్ ముందు భాగం నుంచి.. అక్రమంగా కేసీ కెనాల్‌కు ఆంధ్రప్రదేశ్ నీటిని మళ్లించకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. అనుమతి లేని ప్రాజెక్టుల ద్వారా తరలింపును అడ్డుకోవాలని ఈఎన్‌సీ మురళీధర్ తెలిపారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి తరలింపు ఆపాలని ఆయన లేఖలో కోరారు. మాల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటి తరలింపు ఆపాలన్నారు. బనకచర్ల రెగ్యులేటర్ నుంచి నీటి తరలింపు వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఈఎన్‌సీ మురళీధర్ కోరారు.

కేసీ కెనాల్ ద్వారా ఏపీకి అక్రమంగా నీటిని తరలిస్తున్నారని తెలంగాణ సర్కార్ పేర్కొంది. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతోందని, దానిని ఎలాగైనా ఆపాలని విజ్ఞప్తి చేస్తూ కేఆర్ఎంబీ చైర్మన్ రాయ్ పురేకి ఈఎన్సీ మురళీధర్ రావు లేఖ రాశారు. అలాగే, ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టులను కడుతున్నారని, వాటి నుంచి నీటి తరలింపును అడ్డుకోవాలని ఆ లేఖలో కోరారు. కేసీ కెనాల్ కు తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేస్తున్నారని, అలాంటప్పుడు ఆ మూడింటి ద్వారా నీటిని తరలించడం ఎందుకని లేఖలో ప్రశ్నించింది.

Muchumarri Letter to KRMB-11.08.2021

Read Also…  ACB Rides: తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆగ్రహం.. మరి మా ఉన్నతాధికారులంతా దేనికని నిలదీత

Warangal Mayor: లిప్ట్‌లో ఇరుక్కుపోయిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి.. సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు

రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని భూమిమీదకు తెచ్చిన ప్రాంతం ఎక్కడో తెలుసా..