Land survey: ఆనాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలి.. డ్రోన్లు సహా ఎన్ని సాంకేతిక పరికరాలు కావాలో అన్నిటినీ వాడండి: ఏపీ సీఎం
2023 నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలి. అవసరమైన అన్ని వసతులూ సమకూర్చుకోండి. లక్ష్యాన్నయితే.. కచ్చితంగా చేరుకోవాలి" అని అధికారుల్ని ఆదేశించారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి.
AP CM YS Jagan Review: “2023 నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలి. అవసరమైన అన్ని వసతులూ సమకూర్చుకోండి. లక్ష్యాన్నయితే.. కచ్చితంగా చేరుకోవాలి” అని అధికారుల్ని ఆదేశించారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. శాశ్వత భూ హక్కు – భూరక్షపై సీఎం ఇవాళ అమరావతి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
“డ్రోన్లు సహా ఎన్నిసాంకేతిక పరికరాలు ఎన్ని కావాలో అన్నిటినీ వాడండి. తగిన సాఫ్ట్ వేర్ రూపొందించండి. సిబ్బందికి తగిన ట్రైనింగ్ ఇవ్వండి. ఎక్కడా అవినీతికి తావు లేని విధంగా. అనుకున్న సమయానికి టార్గెట్ రీచ్ కావడానికి తగిన కార్యాచరణ రూపొందించండి. టార్గెట్ రీచ్ కావడం అయితే కచ్చితంగా జరగాల్సిందే” అన్నారు ఏపీ సీఎం.
ఈ కార్యక్రమం ఎలా సాగుతుందో తెలుసుకునేందుకు ప్రతి నాలుగు వారాలకు ఒకసారి.. సమగ్ర సర్వేపై సమీక్ష నిర్వహిస్తామనీ తేల్చి చెప్పారు ఏపీ సీఎం జగన్. అంతే కాదు వారానికి ఒకసారి మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించాలని కూడా సీఎం సూచించారు.
సమగ్ర భూ సర్వేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందనీ.. ఇది అనుకున్న లక్ష్యాలను చేరుకునేలా అందరూ కృషి చేయాలని జగన్ పిలుపునిచ్చారు. అవసరమైతే సర్వే ఆఫ్ ఇండియా సహాయ సహకారాలను తీసుకునైనా.. పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు ధర్మాన- బొత్స- పెద్దిరెడ్డి- ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.