AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. అకౌంట్లోకి నేరుగా రూ.1.50 లక్షలు.. ఈ ఒక్క పని చేస్తే చాలు..

ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఎలక్ట్రిక్ ఆటోలపై భారీ సబ్సిడీ అందించనుంది. ఈ మేరకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్ ద్వారా ఏకంగా రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ పొందవచ్చు. ప్రస్తుం ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా కూడా మార్చుకోవచ్చు.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. అకౌంట్లోకి నేరుగా రూ.1.50 లక్షలు.. ఈ ఒక్క పని చేస్తే చాలు..
E Auti
Venkatrao Lella
|

Updated on: Aug 16, 2026 | 1:12 PM

Share

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు నూతన సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా ఈ-ఆటోలు కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ మొత్తంలో సబ్సిడీ అందిస్తోంది. ఒక్కొ వాహనంపై గరిష్టంగా రూ.1.50 లక్షల సబ్సిడీ ఇస్తోంది. మొత్తం 18,766 ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయాలని ప్రభుత్వ లక్ష్యం నిర్దేశించుకుంది. తొలి దశలో వీటిని అందించాలని భావిస్తోంది. ముందుగా పెట్రోల్, డీజిల్ ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తారు. అనంతరం వీటిని సబ్సిడీపై లబ్దిదారులకు అందిస్తారు. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ పథకం ద్వారా దీనిని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ పథకాన్ని స్టార్ట్ చేయనుంది.

ఏకంగా రూ.1.50 లక్షల సబ్సిడీ

ఆటో డ్రైవర్లు ఎలక్ట్రిక్ రెట్రోఫిట్ కిట్ లేదా ఈ-ఆటో కొనుగోలు చేయడానికి రూ.1.50 లక్షల సబ్సిడీ అనేది అందిస్తారు. ముందుగా ఆటో యూనియన్లతో దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కిట్ తయారీదారులను ఎంపిక చేయడం, ధరలను ఖరారు చేయడం లాంటి చర్యలు చేపట్టనుంది. సబ్సిడీ అందించేందుకు ఒక ఆన్ లైన్ పోర్టల్ త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ పోర్టల్ ద్వారా డ్రైవర్లు దరఖాస్తు చేసుకుని సబ్సిడీ పొందవచ్చు. ఇక దరఖాస్తులను పరిశీలించడం, ఆర్‌టీఏ డాక్యుమెంట్లను జారీ చేయడం వంటివి పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతాయి. అర్హులను డీబీటీ ప్రక్రియ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లలో సబ్సిడీ సొమ్ము ప్రభుత్వం జమ చేయనుంది. ఈ ప్రక్రియ మొత్తం పాదర్శకంగా మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.

త్వరలో విధివిధానాలు జారీ

ఈ సబ్సిడీ పథకానికి తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ 2026గా ప్రభుత్వం నామకరణం చేసింది. రాష్ట్ర కేబినెట్ కూడా ఈ పథకానికి ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించారు. సోమవారం ఈ పథకానికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. అనంతరం పథకం విధివిధానాలు విడుదల చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా డ్రైవర్లకు రెండు ఆప్షన్లు ఉంటాయి. కాంపోనెంట్ ఏ కింద ఇప్పటిక ఉన్న పెట్రోల్, డీజిల్ వెహికల్‌కు ఎలక్ట్రిక్ కిట్ అమర్చుకోవచ్చు. కాంపోనెంట్ బి కింద పాత ఆటోలో స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. ఈ రెండు ఆప్షన్ల కింద రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ పొందే అవకాశముంది.

Follow Us