YSR Kadapa district: స్కూలులో పిల్లల్ని టీచర్ కోట్టడం సహజమే.. అయితే తన కూతుర్ని రోజూ ఎందుకు సతాయిస్తున్నారంటూ టీచర్ ను ప్రశ్నించింది.. ఆ మహిళ.. ఇంకేముంది ఆ టీచర్ రగిలిపోయింది.. అడిగేందుకు వెళ్లిన స్టూడెంట్ తల్లిపై దురుసుగా ప్రవర్తించింది.. అంతటితో ఆగకుండా స్టూడెంట్ తల్లిని కూడా ఆ టీచర్ చంప పగలగొట్టింది. ఇదంతా పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సమక్షంలోనే జరిగింది. ఈ షాకింగ్ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పొద్దుటూరులోని ఎద్దుల సుబ్బమ్మ బాలికల ప్రాథమిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న లహరి అనే విద్యార్థిని టీచర్ సునంద ప్రతిరోజు కొడుతోందని.. తల్లికి చెప్పింది. దీంతో లహరి తల్లి శనివారం మధ్యాహ్నం స్కూలుకు వెళ్లింది. తన కూతురిని ఇలా రోజు ఎందుకు సతాయిస్తున్నారంటూ ప్రధానోపాధ్యాయునికి చెప్పింది.
ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయుడి రూంలో పంచాయితీ సైతం జరిగింది. అయితే, అందరిముందు లహరి తల్లి మాట్లాడుతుండగా ఆగ్రహావేశాలకు లోనైన టీచర్ సునంద ఆమె చంపను చెళ్ళుమనిపించింది. అందరూ చూస్తుండగా నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆగ్రహావేశానికి లోనైనా టీచర్ సునంద.. లహరి తల్లిపై తన ప్రతాపాన్ని చూపించింది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ ఆవేశానికి లోనై ఇలా తల్లిపై దాడి చేయడం ఏమిటంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు.
కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్టూడెంట్ తల్లిపై టీచర్ దాడి చేసిన ఘటనపై విద్యాశాఖ అధికారులు ఆరా తీసినట్లు సమచారం..
మరిన్ని ఏపీ వార్తల కోసం..