వైసీపీ తీరుపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. గన్నవరంలో పర్యటించిన ఆయన టీడీపీ ఆఫీస్‌ను పరిశీలించారు. టైమ్ ఫిక్స్ చేసుకుందాం.. ఎన్నివేల మంది వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు..దొంగదెబ్బలు తీయడం కాదు..పోలీసులను వదిలేసి రావాలంటూ ఛాలెంజ్ చేశారు చంద్రబాబు.
టీడీపీ నేత దొంతు చిన్న కుటుంబ సభ్యలను పరామర్శించారు చంద్రబాబు. టీడీపీ ఆఫీస్, నేతలపై దాడి జరగడానికి కారణం పోలీసులే అని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పోలీసులపై ఎంక్వైరీ వేసి ..వాళ్ల అంతు చూస్తానంటూ హెచ్చరించారు.
చంద్రబాబు సవాల్ విసిరితే ముఖ్యమంత్రి జగన్ రావాలా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. బాబు సవాల్‌కు భయపడాలా అని నిలదీశారు. పిచ్చిపట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాల్ విసిరే ముందు తన ఎమ్మెల్యే పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు, బ్లాక్‌క్యాట్ కమాండోలు వద్దని కేంద్రానికి చెప్పాలని అన్నారు. చూస్తుంటే చంద్రబాబుకు బాలకృష్ణ పూనినట్టు కనిపిస్తోందని విమర్శించారు. ఆయన సినిమాల్లో నటిస్తుంటే ఈయన మైకు ముందు డైలాగులు చెప్తున్నారని విమర్శించారు. గన్నవరానికి పట్టాభిని పంపించి గొడవలు సృష్టించింది చంద్రబాబేనని కొడాలి నాని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..