TDP Protests: ఎల్లుండి నుంచి టీడీపీ నిరసనలు.. వాటిని నివారించాలని డిమాండ్.. శ్రేణులకు దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ సారా అరికట్టాలి. జె-బ్రాండ్స్ మద్యాన్ని నిషేధించాలనే డిమాండ్లతో ఎల్లుండి (20వ తేదీ) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ(TDP) నిర్ణయించింది. మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని...
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ సారా అరికట్టాలి. జె-బ్రాండ్స్ మద్యాన్ని నిషేధించాలనే డిమాండ్లతో ఎల్లుండి (20వ తేదీ) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ(TDP) నిర్ణయించింది. మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని గ్రామ స్థాయి నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఆదేశించారు. సీఎం జగన్ ధనదాహంతో మహిళల తాలిబొట్లు తెగిపోతున్నయాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో లేని మద్యం బ్రాండ్లు ఏపీ (Andhra Pradesh) లోనే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించిన చంద్రబాబు.. అధికారంలోకి వస్తే మద్య నిషేదం చేస్తామన్నారని గుర్తు చేశారు. జగన్ తెచ్చిన కొత్త బ్రాండ్లు స్లో పాయిజన్ గా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లను ఎవరు తయారు చేస్తున్నారు.? ఎంతకు అమ్ముతున్నారు.? అనే విషయాలపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత బ్రాండ్ల ద్వారా జగన్ ఏడాదికి ప్రజల జేబుల నుంచి రూ.5 వేల కోట్లు కాజేస్తున్నారని విమర్శించారు.
” రాష్ట్రంలో మద్యం, నాటుసారా ఏరులై పారుతోంది. వైసీపీ నేతలే కల్తీసారాను విక్రయిస్తున్నారు. కల్తీ నాటుసారాతో చనిపోయిన వారిని సహజ మరణాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటన చేయటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వ అక్రమ నాటుసారా, మద్యం వ్యాపారం వల్లే 36 మంది బలయ్యారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. కల్తీ సారా నియంత్రించే వరకు పోరాటం చేపడతా. ఎందరిని జైలులో పెట్టినా కేసులకు భయపడం.”
– చంద్రబాబు, టీడీపీ ప్రెసిడెంట్
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నాటుసారా తాగి 15 మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదని ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌చేశారు. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకూ నాలుగు రోజుల్లో మొత్తం 18 మంది ఒకే తరహా లక్షణాలతో మృతి చెందారు.
Also Read
Tamilnadu: ఎమ్మెల్యే మనవడిని అంటూ బైక్‌పై స్టిక్కర్.. ‘పెళ్లి కాకుండానే ఆ నేతకు మనవడు ఎలా..?’
Telangana: వెంటాడిన విధి.. ట్రాక్టర్ నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. ముగ్గురు దుర్మరణం
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మళ్లీ అందుబాటులోకి ఆర్జిత సేవలు